![]() | షణ్ముఖస్వామి వచనాలు | శరణ శరణెయల వచనాలు | ![]() |
శరణుల వచనాలు |
సూచిక (index) |
ఎంపిక చేసుకున్న వచన |
---|
సగరం బొమ్మణ్ణమీ అంగ దర్శనం చేత కన్నుల మైల తొలగింది. మీ తలపుల నెమరువేతలో మనసు మైల తొలగింది మీ గురించిన మాయని తెలివితో అన్నిమైలల భ్రాంతి తొలగింది ఇటువంటి నానావిధాలైన భేదోపభేదాలన్నీ మీ కారుణ్యంలో లయమైనాయి సగరం బొమ్మని ఒడయడా తనుమన సంగమేశ్వరా. / 2094 |
శరీర వ్యవహారంలో వుండీ కరణాలు చెప్పినట్టల్లా ఆడకుండా వుంటే శరీరంతో సంగమే మేలు. ఇంద్రియాల సంసర్గంలో వుండీ వాటి తాకిడి సంగం తెలిసివుంటే ఇంద్రియాలతో సంగమే మేలు అజ్ఞానంలో వుండి, బయటపడి తన చావు నెరిగితే సావయవమే మేలు సగరపుబొమ్మని ఒడెయడు తనుమన సంగమేశ్వర లింగము కూడి సంగమించిన పిదప. / 2095 |
బురుజుల మీదనిల్చి పోరాడేవారికేమి భయం? రాతి అరుగు పైనున్న గుడ్డివారికేమి భయం? నా సుఖదుఃఖాలకు సంతసించాను. నీవు ముందు నేను వెనుకగా వున్న పిదప నాకొచ్చిన ఆయాసమేమి? సేవకునికైన అవమానం యజమానిదైనట్లు, సగరం బొమ్మని ఒడెయడైన తనుమన సంగమేశ్వర లింగా నీ వుండగా నాకింకేమి భయం? / 2096 |
తనువులోపలి తనువులో కూడిన వారెవరో? మనసులోపలి తలపుల్లో తలచుకొనే వారెవరో? నోటిలోని నోటితో తినే వారెవరో? కళ్ళల్లోని కళ్ళల్లో చూచే వారెవరో? నేనూ, నీవనే మాటలవేమి చెపుమా సగరపు బొమ్మని ఒడయా తనుమన సంగమేశ్వరా! / 2097 |
పూవులు కోయగలరు గానీ పూలతావిని కోసినవారున్నారా అయ్యా చక్కగా మాట్లాడే వారున్నారే కానీ మాటల్లోని శ్లేషను గమనించిన వారెవ్వరు గలరయ్యా ఇది నీతిలో ఒదిగేది క్రియ క్రమం తప్పక చేయుటలో భావం శుద్దిగా వుండాలి మాటలు పలికేటప్పుడు మాట ప్రకారం తాను ఒదిగి యోగ్యుడై వుండాలి అది కూటస్థం సగరపు బొమ్మని ఒడియా తనుమన సంగమేశ్వరా. / 2098 |
సత్తిగె (గాడుగుల) కాయకం రామయ్యఉదయంలో ఉత్పత్తియై, మధ్యాహ్నానానికి స్థితిని చేరి అస్తమయ వేళలయందే దేహాన్ని పొందిన పిదప నిశ్చింతగా నిల్చి కష్టాలు విడివడే రావు చూపరా పగలు ఆకలి, దాహం, రేయికి విషయవ్యసన వ్యాపారాలు ఇలాంటి దేహంలో చేరి పంచ భూతాలైదింటికి నెలవైతివికదా ఐఘంటేశ్వర లింగమా. / 2099 |
కాయకమని కల్పించుకొని చేసేవేళ దొంగలాగ పెళ్ళాం, పిల్లల కోసమని దాచుకొన్న బుట్టలో తీసుకొనిపోయి పరమ పవిత్రమైనది ఇచ్చినా అది గురు, పర, చర ఈ మూడింటి ప్రసాదము కాదు అట్టివాడు మృఢ భక్తుడని వాడింట్లో చేరి తింటే కుక్క తినగా మిగిల్చిన ఎంగిలి మాంసాన్ని నక్కలు తిన్నట్లు ఐఘంటేశ్వర లింగము సాక్షిగా..! / 2100 |
సిద్ధాంతి వీరసంగయ్యనీటి చినుకు వలన ఏర్పడిన ముత్యం శాంతంగా వున్న తటాక జలంలో వేయగా తొలుతటీ తన స్వరూపం వచ్చిందని తాను గట్టిపడలేదు ఈ ముత్యం ఆరీతిగా నీటి చినుకులా మారలేదు ముత్యం చినుకుల భేదాన్ని గ్రహించిన వారిని ద్వైతాద్వైతాలు తెలిసిన వారంటాను అలాకాక గెలుపోటములకు పోరాడే రాతిగుండెల వారికి ఎక్కడ? గోళకాకార విశ్వ విరహిత లింగము సాధ్యమయ్యేను? / 2101 |
సుంకరి బంకన్నఅంగంలో వుండి అవధానిపై భావంలో వుండి భవచ్ఛేదనమై సుఖంలో వుంటూ ప్రాణాంతకుడవై సకలభోగాల ననుభవిస్తూ భోగవిరాగియై బంకేశ్వర లింగాన్ని చూస్తూకూడు చూడ నట్లుండు మదిలోని ఘనంలో నిలిచి! / 2102 |
అన్నం పైని ఆసక్తి నిద్ర పైని ఆసక్తి అంగనల పైని ఆసక్తి లింగము పై నుండాలి శివలింగంలో మోహ మలవరచుకుంటే, తన్ను తానీయగలడు మన చెన్నబంక నాథదేవుడు. / 2103 |
[1] Vachanas selected from the book "VACHANA" (Edited in Kannada Dr. M. M. Kalaburgi), Telugu Version Translation by: G. Chandrasekhara Reddy. ISBN: 978-93-81457-05-4, 2012, Pub: Basava Samithi, Basava Bhavana Benguluru 560001.
![]() | షణ్ముఖస్వామి వచనాలు | శరణ శరణెయల వచనాలు | ![]() |