![]() | శరణ వచనాలు 1518_1541 | జేడర (సాలె) దాసిమయ్య | ![]() |
శరణ వచనాలుఉళియుమేశ్వర చిక్కన్న, ఎచ్చరిక కాయకపు ముక్తినాథయ్య, ఎలెగారి (ఆకుల) రామయ్య, ఏకాంతి రామితందే (తండ్రి), ఏలేశ్వరం కేతయ్య, ఒక్కలిగ (కాపు) ముద్దణ్ణ, కంబం మారితందే (తండ్రి), కిన్నెర బ్రహ్మయ్య, జగళగంటి (జగడాల) కామన్న తండ్రి |
సూచిక (index) |
ఎంపిక చేసుకున్న వచన |
---|
ఉళియుమేశ్వర చిక్కన్నఎముక, చర్మం, మాంసం, రక్తం కండల పనికిరాని యొడలిని నేనేట్లు కాపాడేదయ్యా సారం లేని సంసారం ఎన్నటికి దీన్ని మోస్తూ రోదించడం వదులుతానయ్యా? ఎన్నటికి దీని సంశయం తొలగునయ్యా? జారిన బిందె నీళ్ళల్లో పగిలినట్లు నా తనువు పగిల్చి మీలో ఎప్పుడు కలిసేనో ఉళియుమేశ్వరా! / 1591 |
నేను భక్తుణ్ణి, నేను శరణుణ్ణి, నేను లింగైక్యుడనంటే లింగం నవ్వదా? పండుగ పంచేంద్రియాలు నవ్వవా? అరిషడ్వర్గాలు నవ్వవా? నా శరీరంలోని సత్వరజతమో గుణాలు నవ్వవా? చెప్పవయ్యా ఉళి ఉమేశ్వరా! / 1592 |
నా మనస్సు మంచం చేసి నా తనువును పాన్పుచేసి పరుస్తాను రావయ్యా నా అంతరంగంలో వుందువు రావయ్యా నా బహిరంగంలో వుందువు రావయ్యా నా శివలింగ దేవుడా రావయ్యా నా భక్త వత్సలా రావయ్యా ఓం నమశ్శివాయ అని పిలుస్తాను ఉళి ఉమేశ్వర లింగమా రావయ్యా! / 1593 |
కాలువ నీటిని త్రాగి వండిన ఆకుకూరను మేసవి, ఉనికి లింగపు గూడులా వుండాలి చెరువు నీట జలక మాడి తడి ఆరిన గుడ్డలు కట్టుకొని ఉనికి లింగపు గూడై వుండాలి ఎరుక నంతాదాచి . పరులలో ఆశలు పుట్టించి నన్ను పొడిచి పొడిచి చంపుతారా ఉళియుమేశ్వరా! / 1594 |
వారణాసి, అవిముక్తి, ఇక్కడే వున్నాడు మంచు కేదారుడు, విరూపాక్షుడు ఇక్కడే వున్నాడు గోవర్ల సేతు రామేశ్వరుడు ఇక్కడే వున్నాడు శ్రీశైల మల్లికార్జునుడిక్కడే వున్నాడు సకళ లోక పుణ్యక్షేత్రుడు ఇక్కడే వున్నాడు. సకల లింగ ఉళి ఉమేశ్వరుడు తనలో వున్నాడు! / 1595 |
ఎచ్చరిక కాయకపు ముక్తినాథయ్యఅంగవికారము చాలు లేవండి బహువైవిధ్యమయ ప్రకృతిని మరచి లేవండి మీ భక్తి ముక్తుల లింగపు చేరిక తలచి లేవండి మీ గురువాజ్ఞను మీ విరక్తి జ్ఞానపు సావధానత తెలిసి లేవండి చాటిం పైనది, రెప్పవేస్తే లేదు శుద్ధ సిద్ధ ప్రసన్న కురంగేశ్వర లింగమును కలియనెరిగితే లేవండి! / 1596 |
నాలుగు జాములో ఒక జాము ఆకలి, కోరిక, మిగిలిన విషయాశకు సరిపోయింది మరొక జాము నిద్ర, స్వప్నం, కలత నానా అవస్థలకు వదిలింది. మరొక జాము స్త్రీల వక్షస్థలం, అధర చుంబనం వంటి అనేక విధ అంగ వికారాలతో చచ్చింది ఇంకొక జాముంది మీరు మీరు వచ్చిన దారిని తెలిసి ముందరి బాగోగులను గమనించి నిత్య నియమాలను విస్తరించుకొని మీ శివార్చన, పూజ, ప్రణవపు ప్రమధాళి భావం బలుపు, విరక్తి విడుదల, సద్భక్తిముక్తి ఇట్లే కర్తవ్యపు కట్టళ్ళు తప్పకండి అరుణోదయానికి ముందే ఖగ, విహంగాలు, పశుమృగాలు, నరమను కులం లేవకముందే ధ్యానారూఢులు కండి శుద్ధ, సిద్ధ, ప్రసిద్ధ, ప్రసన్న కురంగేశ్వర లింగం కలియనెరిగితే...! / 1597 |
ఎలెగారి (ఆకుల) రామయ్యఆకు పక్వమై ఆరునెలలు వుంటుంది వ్రతం చెడగా ఆక్షణం భ్రష్టుడంటారు ఆకు ఎండినా అది శివార్పణం వ్రతం నష్టం చెందిన క్షణాన మరణమేనయ్యా ఆతురేశ్వర లింగమా! / 1598 |
ఏకాంతి రామితందే (తండ్రి)అశనం, వ్యసనం, సర్వవిషయాలలో మునిగిపోయి పిసినిగొట్టుతనంతో నసుగుతూ చేసే పూజతో సదురువుకి సంబంధం లేదు నువ్వులనూనె - నీటి బేధంలా ముత్యంలోని - దారంలా కుప్పుసం వదిలిన పాము శరీరంలో గురుస్థల సంబంధం నా తండ్రి చెన్నరామేశ్వర లింగమును తెలుసుకోగల్గితే. / 1599 |
తనువుల్లో భేదాలుండి ఆత్మ ఒకటే అనడం అదెట్టిమాట నిప్పుతో వచ్చిన వెలుగు కాల్చగలదా నిప్పు లేకుండా? కొన్ని ఘటాల్లో వారివారి దారుల్లో అనుభవిస్తూ మరొక దానిలో కూటస్థమైన సుఖం వుంటుందా? ఈ గుణం నా తండ్రి చన్న రాముని తెలుసుకొన్నప్పుడే! / 1600 |
[1] Vachanas selected from the book "VACHANA" (Edited in Kannada Dr. M. M. Kalaburgi), Telugu Version Translation by: G. Chandrasekhara Reddy. ISBN: 978-93-81457-05-4, 2012, Pub: Basava Samithi, Basava Bhavana Benguluru 560001.
![]() | శరణ వచనాలు 1518_1541 | జేడర (సాలె) దాసిమయ్య | ![]() |