Back to Top
Previous అడపం అప్పన్న శరణుల వచనాలు 2216_2299 Next

హావినహాళు కల్లయ్య వచనాలు

హంజినకాళగ (కోడిపంద్యాల) దాసయ్య , హెండద (సారాయి) మారయ్య, హొడెహుల్ల బంకన్న వచనాలు

సూచిక (index)
వచనను ఎంచుకోండి:

ఎంపిక చేసుకున్న వచన
*

హావినహాళు కల్లయ్య

ఆయానాటి ప్రొద్దుటి సంసారం ఆయా ప్రొద్దే గ్రహిస్తుంది.
ఎన్నడయ్యా మిమ్ము స్మరిస్తాను? ఎన్నడయ్యా మిమ్ము పూజిస్తాను?
సమచిత్తంతో మిమ్మల్ని స్మరిస్తే
రేపటికన్నా నేడే మంచిది మహాలింగ కల్లేశ్వరా. / 2182
అత్యాశ అనేదే పాపం, వేరే పాపమనేది లేదు కంటిరేమయ్యా!
పరిణామమనేదే పరమానందము,
వేరే పరలోకము లేదు, కంటిరేమయ్యా!
ఇహపరాల ఆశ లేకుండుటయే శివయోగము,
మహాలింగ కల్లేశ్వరుడెరుగు, సిద్దరాముని తీరు. / 2183
వికసించిన పుష్పం పరిమళించక ఉంటుందా?
నీండు సాగరమున నురుగుల తరగలాడకుంటాయా?
నింగిని తాకేవాడు కొంకి కర్రను పట్టుకొంటాడా?
పరమానందకారకుడు, కర్మాన్ని పోగొట్టకుంటాడా?
మహాలింగ కల్లేశ్వరా? / 2184
ఎరుకయే గురువు, ఆచారమే శిష్యుడు, జ్ఞానమే లింగము,
పరిణామమే తపస్సు, సమత అనడమే యోగప్రాప్తి చూడరా.
ఇన్ని ఎరుగక వేషముదొడిగి, వెంట్రుకలు పీకి బోడియైతే*
మహాలింగ కల్లేశ్వరదేవుడు నవ్వును.

*తల వెంట్రుకల్ని చేతితో పీకివేసే క్రియ. ఇది జైనాచారం. / 2185
అశనమాప్యాయము, వ్యసనముండగా
ఆ మిమ్ము తలచేది మిథ్యమయ్యా,
ఆ మిమ్ము పూజించేది బూటకమయ్యా,
నా ఆకలికి నీవే ఆహారమైతే,
నేను మిమ్ము తలచేది నిజము గనరా, మహాలింగ కల్లేశ్వరా. / 2186
ఏ నేమాన్నీ చేపట్టడు, ఏ కర్మాన్నీ పొందడు,
ఏ శీలాన్ని గ్రహించడు, ఏ తపస్సుకీ పూనుకోడు
ఏ గొడవలకీ పోడు, కేవలాత్మకుడు.
సాకారుడు నిరాకారుడనిపించుకున్న సహజుడతడే
మీ శరణుడు, మహాలింగ కల్లేశ్వరా. / 2187
పెట్టదా కోయిల, కాకి గుడ నడుమ?
పెంచదా తన పిల్లను మనోబుద్ధితో?
పెట్టిననేమిరా, దేవా పిండాన్ని తెచ్చి,
మానవయోనిలో పుట్టిననేమిరా?
లింగశరణుడు నరుల యోనిలో పుట్టినవాడా? కాదు,
పుట్టదా పిట్ట కడుపులో రాగిచెట్టు?
ఇదీ కారణము, మహాలింగ కల్లేశ్వరా
కాకికి పిక సంతానమా? / 2188
నీటి చల్లదనాన్ని తామర కాక,
ఎండిన మోడెక్కడ తెలియునో?
కుసుమ పరిమళాన్ని తుమ్మెద కాక,
బయటి ఈగేమెరుగునురా?
పాలు రుచిని హంస కాక
బురదలోనున్న కొంగేమెరుగునురా?
మామిడి పళ రుచిని రాచిలుక లెరుగును కాని,
బయటి కోళ్లేమెరుగునురా?
భోజనము రుచిని నాలుక కాక,
కలిపే చెయ్యి తానెలా ఎరుగునురా?
కూటమి సుఖమును బోవని కాక,
బాలిక తానేమి ఎరుగునురా?
చంద్రసూర్యుల అంతరాలను ఖేచరులెరుగుదురు కానీ,
గగనమున ఆడే డేగలవి ఎట్లెరుగునురా?
ఓరి మహాలింగ కల్లేశ్వరయ్యా,
మీ నిత్యనిజైక్యుల ఇంగితాన్ని
మహానుభావులెరుగుదురు కానీ,
లోకపు జడజీవులనిపించే మానవులే మెరుగుదురయ్యా? / 2189
ఎడమ చేతిలో కంకణము పెట్టి,
కుడి చేతిని కత్తరించుకొంటే నొప్పింకేది చెప్పరా.
దేహమొకటి ప్రాణమొకటై, బాధ ఇంకెవరిది చెప్పరా.
లింగ జంగమమునారాధించి నిందకు గురి చేస్తే నొచ్చితినయ్యా
మహాలింగ కల్లేశ్వరా, / 2190
ఎక్కడెక్కడ చూచినా
అక్కడక్కడ మిమ్మునే చూస్తాను,
లేచి చూచి మిమ్మునే చూస్తాను, నిద్ర చేసి మిమ్మునే చూస్తాను,
అహోరాత్రులలో మీ ధ్యానములో ఉంచు,
మహాలింగ కల్లేశ్వరా. / 2191

References

[1] Vachanas selected from the book "VACHANA" (Edited in Kannada Dr. M. M. Kalaburgi), Telugu Version Translation by: G. Chandrasekhara Reddy. ISBN: 978-93-81457-05-4, 2012, Pub: Basava Samithi, Basava Bhavana Benguluru 560001.

*
Previous అడపం అప్పన్న శరణుల వచనాలు 2216_2299 Next