![]() | అరివిన మారితందే (తండ్రి) | చందిమరసు వచనాలు | ![]() |
ఉరిలింగపెద్ది వచనాలు |
సూచిక (index) |
ఎంపిక చేసుకున్న వచన |
---|
ఉరిలింగపెద్దిఅమృతానికి ఆకలి వుంటుందా? నీటికి దాహం వుంటుందా? మహజ్ఞాన స్వరూపునికి విషయం (కోరిక) వుంటుందా? సద్గురుని కారుణ్యం పొంది లింగార్చన చేసే మహ భక్తునికి ఇతర ముక్తి పట్ల ఆశ వుంటుందా? వారికి అది స్వయంభువు సహజ స్వభావం ఇంక తృప్తి, ఆప్యాయత, వెతుక్కోవాలా? ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా! / 1542 |
అమృతం అందరికీ అమృతంగానే వుంటుంది కానీ కొందరికి అమృతమూ, మరి కొందరికి విషము కాదు. ఎంతో అంతే, శ్రీ గురువు అందరికీ గురువై వుండాలయ్యా ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా! / 1543 |
అమృత సేవనం తరువాత ఇతర రుచులను నిశ్చయించ గలమా సత్యం, శాంతి, జ్ఞానం కలిగిన మహపురుషునికి సుఖ పదవిని నిశ్చయించగలమా సద్గురు కారుణ్యాన్ని పొందిన మహభక్తునికి ముక్తిని నిశ్చయించగలమా ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా! / 1544 |
అయ్యా! మీ శరణుల చరణాల భక్తి నాకు సాలోక్య పదవయ్యా అయ్యా! మీ శరణుల అర్చన పూజలే నాకు సామీప్య పదవయ్యా అయ్యా! మీ గణాల ధ్యానమే నాకు సారూప్య పదవయ్యా అయ్యా! మీ పురాతనుల జ్ఞానానుభవ సమరసానందమే నాకు సాయుజ్యపదవయ్యా ఈ చతుర్విద పదవులు కాక ఇతర పదవులు నాకు తెలియవయ్యా! ఉరిలింగ పెద్ద ప్రియ విశ్వేశ్వరా! / 1545 |
జ్ఞాన హీనమైన భక్తి భవమునకు తెచ్చింది. అదెలాగంటే ఫలభోగాలను ఆశించేవాడినై ఫలాన్ని తిని తిరిగి భవానికి వస్తాను గనుక ఇది కారణం జ్ఞానంతో ముక్తిని పొందాలంటే అనుభవమే కావాలి ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా! | / 1546 |
ఆది మధ్య అవసానంలో కూడా నన్ను ఆశ పీడిస్తుంది శివా శివా! ఆశ వల్ల రోసిపోతున్నాను శివా శివా! ఆ బంగారం, స్త్రీ, మన్నుల పై ఆశ గాయం చేసి వేధిస్తుంది. శివా శివా! ఈ ఆశను తుడిచివేసి మీ శ్రీ పాదాల పైనాశల నివాసిగా ఉంచవయ్యా ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా! / 1547 |
ఆశ ఉండు వరకు ఆశ్రయించే ఆశ్రయం దాసికన్నా హీనాతి హీనం కనండిరో ఆశే దాసి గమనించండయ్యా ఆ నిరాశయే ఈశ్వర పదం గమనించండయ్యా దాసత్వము, ఈశత్వము రెంటినీ విచారించి ఆశ అణిగితే అదే ఈశ పదము తప్పనిదయ్యా ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా! / 1548 |
నా శరీరంలో నీకు మజ్జనం నా నుదిటిలో నీకు గందాక్షతలు నా కొప్పు నీకు పూలపూజ నా నేత్రాలలో నీకు వివిధ రూపాల విచిత్ర వినోదం నా చెవులలో నీకు పంచ మహ వాద్యాల నాదం నా నాసికలో నీకు సుగంధ ధూప పరిమళం నా జిహ్వలో నీకు షడ్రసాన్న నైవేధ్యం రెండు నా చర్మంలో నీకు వస్త్రాభరణాలంకార పూజ నా సచ్చిదానంద శయ్యా గృహంలో నువ్వు స్పృశించి కలిసియున్నందున నీవు నేననే రెండు మాసి తాను తానైన ఘనత నేమందును ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా! / 1549 |
నా గమనమే నీ గమనం నే విన్నది, నీవు విన్నది నా చూపే నీ చూపు నా శరీర స్పర్శే, నీ శరీర స్పర్శనం నా శరీర సుఖ భోగమే, నీ శరీర సుఖ భోగం నాలో నువ్వు, నీలో నేను నా ప్రాణం నీవు, నీ ప్రాణం నేనైన కారణంగా నేను స్పృశించిన చోటంతా నీ పూజేనయ్యా ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా. / 1550 |
నా సర్వాంగాలలో లింగడున్నాడు, వున్నాడు నా మనసు తెలియక చెడ్డాను, చెడ్డానయ్యా నా అంతరంగ బహిరంగాలలో లింగడున్నాడు, ఉన్నాడు నా మనసు తెలియక చెడ్డాను, చెడ్డానయ్యా విశ్వాసంతో గ్రహించలేక చెడ్డాను, చెడ్డానయ్యా ఈ మనసును విశ్వాసంతో గ్రహిస్తే సత్యుడౌతా, నిత్యుడౌతా, ముక్తుడౌతా ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా! / 1551 |
[1] Vachanas selected from the book "VACHANA" (Edited in Kannada Dr. M. M. Kalaburgi), Telugu Version Translation by: G. Chandrasekhara Reddy. ISBN: 978-93-81457-05-4, 2012, Pub: Basava Samithi, Basava Bhavana Benguluru 560001.
![]() | అరివిన మారితందే (తండ్రి) | చందిమరసు వచనాలు | ![]() |