Back to Top
Previous శరణ వచనాలు 2022_2052 అరివిన మారితందే (తండ్రి) Next

అడపం(హడపద) అప్పన్నగారి పుణ్యస్త్రీ లింగమ్మ వచనాలు

సూచిక (index)
వచనను ఎంచుకోండి:

ఎంపిక చేసుకున్న వచన
*

అడపం(హడపద) అప్పన్నగారి పుణ్యస్త్రీ లింగమ్మ


అంగాన్ని మరిచిన వాడికి లింగం హంగెందుకో?
తెలివి ఉన్నవాడికి లింగ చిహ్నం హంగెందుకో?
తాను తానైన వాడికి ధ్యానం హంగెందుకో?
మనసు ముగ్గమైన వాడికి మనుషుల హంగెందుకో?
ఆశను వదిలిన వాడికి రోషం హంగెందుకో?
కాముని కాల్చిన వాడికి కలవరం హంగెందుకో?
లోకనడత చెడిన వాడికి నుడుల హంగెందుకో?
నిశ్చింతుడైన వాడికి మంత్రోచ్చారణ హంగెందుకో?
బయలు బయలైన వాడికి భావం హంగెందుకో?
తనను మరచి మిమ్ము తెలుసుకున్న శరణునికి
అక్కడే ఐక్యం చూడయ్యా
అప్పణ్ణ ప్రియ చెన్న బసవన్నా / 1352
లింగం అనేది లింగంలో అణగింది
లింగం అనేది అంగంలో అణగింది
అంగంలో అణగిన లింగాన్నే
కళ్ళల్లో రెప్పవేయక చూచినపుడు
మంగళకరమైన మహా వెలుగు కనుపించింది
ఇలాంటి మంగళమైన మహావెలుగును
చూపిన శరణుల పాదాలకు మొక్కి
సుఖినయ్యానయ్యా అప్పన్న ప్రియ చెన్న బసవన్నా. / 1353
అయ్యా, నరులలో పుట్టి
భ్రాంతిలో పడిన దాన్ని తెచ్చి
మహా శరణులు నాకు గుర్తు తెలియజేసారు
గురువు అనే దానిని తెలియజేసారు
జంగమమే లోక కరువని తెలిపారు
వారిని ఆశ్రయించి మనస్సు నిలిపాను
కాయం జీవం అనే దానిని గ్రహించాను
భవ బంధనాలను చీల్చాను,
మనసు నిర్మలం చేశాను
కడిగిన అద్దంలా చిత్తం శుద్దమైనప్పుడు
నేను నిజముకురాల నయ్యానయ్యా
అప్పన్న ప్రియ చెన్న బసవన్నా. / 1354
అయ్యా! నేను వచ్చిన జన్మలో జన్మాంతరాలలో
నీవు దాటించితివి అన్నది తెలియక
కళ్ళకు అద్దాన్ని చూపినా మిమ్ము చూడకనే ఉన్నావయ్యా
ఆ కారణంగా మనసుకు ప్రాణమై వచ్చి నిలిచారు.
తనువుకు రూపంగా వచ్చి మెదిలారు.
మీ జాడ తెలిసిన వెంటనే
నా తనువు కరగి మనసు మగ్నం అయింది.
నా మరణ భయం తొలగింది, నా కాయగుణం చెడింది.
కరణగుణం కాలింది, భావం మాసింది, కోరిక ఆరింది
మహా దేవుడైన శరణ చెన్న మల్లేశ్వరుని పాదాన్నిపట్టి ,
నేను నిజముక్తురాల నయ్యానయ్యా,
అప్పన్న ప్రియ చెన్న బసవన్నా / 1355
ఆశను తృంచి, రోషాన్ని వంచి
జగ బంధనాలను చించి
ఈశ్వరుని తలపించే శరణులను
లోకంలోని నీచులెలా తెలుసుకుంటారు
అప్పన్న ప్రియ చెన్న బసవన్నా. / 1356
ఆశ అనేది ఉన్నాక రోషం వదలదు
కామం ఉన్నాక కలవరం వీడదు.
కాయగుణం ఉన్నాక జీవన బుద్ది వీడదు.
భావం ఉన్నాక కోరిక పోదు
నడక ఉన్నప్పుడు పలుకుట తప్పదు
ఇవన్నీ ముందుండగా వెనుకను తెలుసుకున్నానన్న
సందేహులారా, మీరు వినండిరా.
మా శరణులు వెనుకను ఎలా తెలుసుకున్నారంటే
ఆశను వదలారు, రోషాన్ని వీడారు
కాముని కాల్చారు, కలవరాన్ని మింగారు
కాయగుణాన్ని మాపారు, జీవన బుద్ధిని వీడారు
భావాన్ని బయలు కావించారు, కోర్కెను అరగదీశారు
వెనుకను తెలుసుకుని, ముందు లింగమే గూడైన శరణులను
ఈ సందేహులెలా తెలుసుకుంటారు.
అప్పన్న ప్రియ చెన్న బసవన్నా. / 1357
కళ్ళముందు మాణిక్యం ఉండి ఎందుకు చూడరయ్యా.
వాకిలి ముందు పాల సంద్రం ఉండి గుంటలోని నీళ్ళకు పరిగెత్తినట్లు
కళ్ళముందు మహాశరణుడు ఉండి చీకటి అనడం ఎందుకు?
మరి వేరే లింగాన్ని వెతుకుతాను అనడం ఎందుకు?
ఆ మహా శరణుడు మా అప్పన్న ప్రియుడు
చెన్న బసవన్నయే వుండగా? / 1358
చూశాను, విన్నాను అన్న ద్వంద్వాన్ని వదలి
తిన్నాను, తొడిగాను అన్న హంగును వదలి
నడిచాను, చెప్పాను అన్న మాయను నిలిపి, జగత్రీడను నిలిపి
మాటలవల, జపాలపొదలలో చిక్కక దాటి పోయిన
శరణుల పాదాలకు శరణని బతికానయ్యా
అప్పన్న ప్రియ చెన్న బసవన్నా. / 1359
చీకటి, వెలుగు అనేది లేదు నిత్యుడైన వాడికి
చిత్తం, పరచిత్తం అనేది లేదు వస్తుమూలం ఎరిగిన వాడికి
నిత్యం అనిత్యం అని లేదు కృతకృత్యుడైన వాడికి
ఈ మూడింటి గుర్తును పట్టి నిశ్చింతుడై, నిర్వలయుడైన
శరణుని పాదానికి శరణని సుఖినయ్యానయ్యా
అప్పన్న ప్రియ చెన్న బసవన్నా. / 1360
కైలాసం మర్త్యలోకం అని అంటారు
కైలాసం అంటే ఏమిటో
మర్త్యలోకం అంటే ఏమిటో
అక్కడ నడత అంతా ఒక్కటే
ఇక్కడ నడతా ఒక్కటే
అక్కడ పలుకూ ఒక్కటే, ఇక్కడి పలుకూ ఒక్కటే
చూడండయ్యా అంటారు.
కైలాసం వారే దేవర్కులని అంటారు
మర్త్యలోకం వారే మహాగణాలని అంటారు
సురలోకంలో వేయి ఏళ్ళకుకాని తుదిలేదని అంటారు
నరలోకంలో చచ్చి, చచ్చి పుడుతుంటారు
దీనిని చూసి మా శరణులు
సురలోకాన్ని, నరలోకాన్ని తృణమని భావించి
భవాన్ని దాటి తమ పుట్టుకను ఎగిరి,
మహావెలుగును కూడి వెలుగులో బయలయ్యారయ్యారు
అప్పన్న ప్రియ చెన్న బసవన్నా. / 1361

References

[1] Vachanas selected from the book "VACHANA" (Edited in Kannada Dr. M. M. Kalaburgi), Telugu Version Translation by: G. Chandrasekhara Reddy. ISBN: 978-93-81457-05-4, 2012, Pub: Basava Samithi, Basava Bhavana Benguluru 560001.

*
Previous శరణ వచనాలు 2022_2052 అరివిన మారితందే (తండ్రి) Next