Previous గురువువల్లనే బ్రతికి యున్నాను మనసు మైల కడగాలంటే? Next

చిలుక ఇతరులకు జోస్యం చెప్పి ఏమి ఫలం?

- మడపతీ.V. V, జహీరాబాద్.

ధర్మగురు బసవేశ్వరుని వచనము

|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమః ||

చిలుక ఇతరులకు జోస్యం చెప్పి ఏమి ఫలం?
పిల్లి వచ్చు టెరుగదు .
జగమంతా చూచుకన్ను
తనను చంపు బాణాన్ని చూడనేరదు
ఎదిరి గుణం తెలుసునంటారు. తమగుణ మెరుగరు
కూడల సంగమదేవా.

వచనానుభావము: పై వచనములో ధర్మగురు బసవణ్ణ గారు పంచాంగము, జాతకము, జ్యోతిషం, రాహుకాలం, గుళిక కాలం, అశుభ ఘడియలు, వంటివి ఇతరులకు చెబుతూ పోయే వారు తమ గురించి తాము తెలుసుకోవడం చెయ్యరని పై వచనములో బసవణ్ణ గారు రెండు ఉదాహరణలతో చెప్పడం జరిగింది.

చిలుక ఇతరులకు జోస్యం చెప్పి ఏమి ఫలం?‌, జగమంతా చూచుకన్ను తనను చంపు బాణాన్ని చూడనేరదు.

చిలుకలు ఇతరులకు పంచాంగం చెప్పడానికి పంజరం నుండి బయటికి వచ్చి ఏదో ఒక పత్రాన్ని తీసుకొని పంజరంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. పాపం ఇతరుల జాతకం చెప్పే చిలుకకు పిల్లివచ్చే సమయమే తెలియదు.
అదేవిధంగా, ఈ ప్రపంచమంతటినీ చూచే కన్నులు నేను అన్నీ చూశాను ; అనే కన్నుకు తన చావు ఎప్పుడు వస్తుందో చూడకుండా చూడడం అసాధ్యం.

ఎదిరి గుణం తెలుసునంటారు. తమగుణ మెరుగరు

వేరేవారి పంచాంగం, జాతకం, జ్ఞోతిష్యం అంటూ ఇతరులను మనసింకంగా భయోత్పాదన గురిచేసే వారు తమ గుణమును తాము తెలుసుకోవడం మరిచిపోతే అమూల్యమైన జీవితాన్నే కోల్పోతారు.

తమను తాము తెలుసుకోలేని వారు ఎప్పుడూ శరణులు కాలేరు.

బసవాది శరణుల వచనాలను అందరూ చదవాలి అందరిచే చదివించాలి తానూ ఆచరించాలి ఇతరులచే ఆచరించేట్టు చెయ్యాలి

అందరికీ అనంత శరణు శరణార్థులు.

*
సూచిక (index)
Previous గురువువల్లనే బ్రతికి యున్నాను మనసు మైల కడగాలంటే? Next