Previous బసవ వచన ఆచరణతో శరణత్వ సిద్ధి బసవేశ్వరుడు మన ధర్మగురు Next

వీరశైవ మతము మరియు లింగాయత ధర్మమునుకు గల సంభంధము

- కొండా బసవరాజు
ఇ .నెం 1-6-40/7బి, గురుకృపా నిలయం,
పాలసాబ గుట్ట , మహెబుబనగర- -509001

సృష్టికర్త పరమాత్ముని సంకల్పముతొ ప్రపంచమునందు జన్మించిన ప్రవక్తలు ఆర్గురిలొ బసవెశ్వరుడు మహాప్రవక్త యనవచ్చును. కాని ఆతడు ప్రసాదించిన లింగవంత (లింగాయత) ధర్మము విశ్వవ్యాపితముకాలెకుండుటయె కాక భారత దెశముమందును సరియగు విధముగా వ్యాప్తి నొందలెదు. జైన, బౌధ, క్రైస్త, మహమ్మదీయ్, సిఖు ధర్మము లైదును విశ్వవ్యాపితమై అనెకులు ఆయా ధర్మముల నిజజివితములొ పాటిస్తూతత్ఫలిత్తములను అనుభవిస్తున్నారు.

లింగాయత ధర్మము విశ్వవ్యాపితము నరించుట

'లింగవంత' (లింగాయత) ధర్మియులు మాత్రము సరియగు మార్గదర్శనము లెక ధర్మాచరణలను పాటించడము లేదు. బసవేశ్వరులవారి కాలములొ కాలాముఖ, పాశుపత, కాపాలిక, లకులిశ అను నాల్గు ప్రధాన శైవముల యుండినవి. వీరశైవుల ప్రభావముచె వీరిలొ కాలాముఖలు, లకులిశలు తమ ఉనికిని కొల్పొయారు. వీరెల్లరు దేవాలయము లందలి పానవట లింగములను త్రిముర్తిలలొ యెకరగు ఈశ్వరుడు (సాకార శివుడు లెక శంకరుడు) అను భావనతొ అర్చించెడివారు. చిరురూప పానవట లింగములను శిఖపై లెక దండరెట్టపై లెక ఇతర శరీర భాగము లందు ధరింపజెసుకొని అదె భావనతొ తమతమ స్థానములందు పుజిచెడివారు. రెణుకాచార్యడు శంకరాచారుల వారికి చంద్రమౌళెశ్వర లింగమును ప్రసాదించిన దానిని ఆతడు పట్టెయందుంచుకొని పుజా సమయంలొ తెరచి ఆ పానవట లింగమును పుజించెడి వారు. అక్కమహాదెవికి చిన్ననాట గురులింగదేవుడు అను వీరశైవ జంగముడు దిక్శలొ ఇచ్చిన కూడా చిరురూపుగల పానవటముతోడి ఇశ్టలింగమె. ఆమె కల్యాణమునకు వచ్చిన తదుపరియే బసవెశ్వరులువారిచె జంగమదిక్శను పొంది విశ్వదాకార ఇశ్టలింగమును పుజింపదొడగిరి. అంతేగాకా ఏకదేవతా (ఆకారశివుని లేక శ్రేశైల మల్లికార్జునుని) ఉపాసన నుంది ఏకదేవోపాసన (నిరాకార శివుని ఉపాసన)ను అలవరుచు కొనిరి. బసవెశ్వరుడు ముట్టముదట భగవన్నిర్ణయముగా నిరాకార పరమాత్ముని (పరశివుని) గుర్తుగా విశ్వదాకార చిరురూప లింగమును సృష్టించి ఇచ్చినది పట్టదకలేను ఏలిన వసుధిశ భుపాలుడు అను రాజుకు. ఆరాజె అనిమిషయొగిగా మారుట జరిగినది. అల్లమప్రభువు ఈ అనిమిషయొగి కరకములమునుండియే బసవెశ్వర ప్రసాదిత లింగమను గ్రహించారు. చెన్నబసవన్నవారు తన ఒక వచనమందు ఈ విషయమును తెలిపారు.

నా కరస్థలపు లింగమును అనిమిషుడు గ్రహించెను
అనిమిషుని కరస్థలపు లింగమును మీరు గ్రహించితిరి
మీ కరస్థలము హరస్థలమాయేను, గురుతునందలి
గురుతును గ్రహిచిన విధమెటులయ్యా
ఇచ్చేడివారు ఇచ్చెడివారి యందు చిక్కినపితప లింగదేవ ప్రభువా (పరమాత్మా)
మీ కరస్థలపు లింగమునునాకు సాద్యమగు విధ మెటులయ్యా?

ఈ వచనము ఒక ఈతిహాసిక సత్యమును తెలుపుచున్నది. బసవన్నవారె ఇష్టలింగ జనకుడు అనుటను దృవికరించుచున్నది.

మంగళవాడ యందు బిజ్జళరాజు కోలుపులో బసవెశ్వరుడు ధనగార మంత్రి (భండారి) పదవిలో యున్నపుడు కులాలకతీతముగా కొందరకు లింగదిక్శలనిచ్చి నిరాకార్ పరమాత్ముని పూజించుటను ప్రప్రథమముగా అమలు పరచిరి. అధికారము తొడుకాగా అవలీలగా ఈ నూతన అచరణను అమలునకు తెచ్చిరి. రాజు బిజ్జళుడు కాలానుగతముగా చక్రవర్తియె రాజధాని కల్యాణము నుండి పాలించదొడగిన సమయంలొ బసవెశ్వరుడు ప్రధాని (దండనాయక్) పదవిని అలంకరించుట జరుగగా, తాను ప్రవేశపెట్టిన నూతన లింగవంత ధర్మవ్యాప్తికి భద్రమైన పునాదులను వెసిరి. ధార్మిక్ సామ్రాజ్యమునకు వేదికగా అనుభవ మంటపమును నిర్మింపజేసిరి. అందు శూనయ పీఠామును స్థాపించి అల్లమ ప్రభువును ప్రథమ పీఠాధిషులుగా నియుక్తులను గావించిరి..౨7 సంవ న్వత్సరములు అవిచ్చిన్నముగా ధర్మప్రచార కార్యములు అనుభవమంటప మనుడు ధార్మిక్ పార్లిమెంటు ద్వారా కొనసాగేను.

అంతర్వర్ణ్ వివాహముతొ కల్యాణ్ములొ క్రాంతి జరుగుగా బసవెశ్వరుడు కల్యాణమును వీడి కూడలసంగమమును చేరుకొని క్రీ.శ ౧౧౯౬లో శ్రావణ శుద్ధ పంచమి రోజున దేహామునుచాలించి ఈ క్యాపదమునంధిరి. కల్యాణ క్రాంతి కారణముగా లింగవంతధర్మమును నలుదెసల్ ప్రచారముగావవించుటకు ఆటంకమేర్పడినది. శూనయ్యా పీఠ పరంపరలో ప్రధానముగ 5 స్వతంత్ర మఠము లెర్పడి పాటిశోఖా, ఉపశాఖామటములు వేల్కొలది ఏర్పడిననూ ఆ మఠముల ప్రాచుర్యము తప్ప సామానయ జనావళకి సరియగు ధర్మబోధ జరుగలేదు. బసవధర్మము పునరుథ్హానము నొందినది ప్రవచన పితామహుడు పూజ్య లింగానందస్వామి జగద్గురువుల నుండెయె యన్వచ్చు. వారితదుపరి బసవధర్మ పీఠ ద్వితీయ జగద్గురువు (ప్రథ్హమ మహిళా జగద్గురువు) పూజ్యమాతామహాదేవి వారు శునయపీఠపరంపరాగత ధర్మప్రచార్ కార్యమను నిర్వహిస్తున్నారు. కాలజ్నాన వచనముల ప్రకారము బసవెశ్వరుల వారి కాలము ౧౨వ శతాబ్దుములో 'లింగవంతధర్మము' విశ్వవ్యాపితమగుట నిలచిపోయనది, పున్ ౭౭౦ సంవత్సరముల తదుపరి పూజ్యలింగానందస్వామి వారిచె ప్రారంభమైనది పచ్చును. నూతనముగా ఆవిర్భ్హవముందిన బసవధర్మపీఠము స్పూర్తితో శంయపీఠపరంపరాగత నిరంజన్ సాంప్రదాయ మఠములన్ని కూడలసంగమమందలి లింగాయత ధర్మప్రచార కార్యమును పటిష్టముగా నిర్వహించుచున్నది.

నేటి వీరశైవులు ఇష్టలింగజనకుడు బసవెశ్వరుడు అని తెలుసుకొలేక పొవడము శోచనీయమైనట్టి విషయము. ౧౨వ్ శతాబ్దములో బసవెశ్వరుల వారి సమకాలీన శరణుల వచనములు బసవెశ్వరుడే ఇష్టలింగప్రదాత అని స్పష్టముగా తెలుపుచున్నవి. ఈ వచనసాహిత్యమును వీరశైవులల్లొని జంగమ వర్గీయలు అధ్యనము చెయటలేదు. ఈ జంగములు పౌరోహిత్యము, పూజాదికముల్ విధానములే తెలిసికొని వీరశైవ లింగాయతుల పై ప్రభావము చూపుచున్నారు. 'వీరశైవము' అగమోక్తము. 'లింగవంత'(లింగాయత) ధర్మము వచనోక్తము. వీరశైవులు ఇష్టలింగధారులైనా సాకార శివుని మరియు అతడి కుటుంబము ముఖ్యముగా వినాయకుని అరాధించుటకు ప్రాధానణ్యమిత్తురు. బసవెశ్వరుడు స్థాపించిన లింగవంత ధర్మమును పాటించెడివారు నిరాకార్ శివుని (సృష్టికర్త పరమాత్ముని) మాత్రమే పూజింతురు తప్ప సాకార దేవిదేవతలను అర్చించరు. వినాయకుడు విఘ్ననివారకుడని నమ్మరు. పరమాత్మా స్వరూపి ఇష్టలింగమును పూజించిన వారలకు ఏ విఘ్హనములు కలుగవని ధర్మపిత బసవణ్ణవారే తన ఒక వచనంలో తేలిపారు.

"ప్రాత:కాలములో ఆర్తితో (పరమాత్ముని) లింగమును పూజించి, స్మరించిన తప్పును విఘ్నములు, అపమ్ర త్యువు" బసవ వచనము.

లింగాయత ధర్మము విశ్వ ధర్మముగా గుర్తింపుబడయుట్కు అని అర్హతలు కలిగియున్నా వీరశైవము ప్రధాన ఆటంకముగా నిలచినది. ఈ వీరశైవము సప్తశైవముల్లో యొకటి మాత్రమే. విశ్వధర్మగా లింగాయత ధర్మమును ప్రసాదించిన బసవెశ్వరుడు వీరశైవమతోద్దారకుడని వీరశైవ జంగములునమ్ముట వారి అపరిపక్వత అని వచనశాశ్త్రమును అధ్యయనము చెసిదారలు మాత్రమే గుర్తింతురు. బహు సంఖ్యాకులైన లింగాయతులు వచన శాస్త్రమును అభ్యసించి తదనుగుణముగా నడచుకొనిననె లింగాయత ధర్మము విశ్వ ధర్మమై వెలుగొందును. వీరశైవజంగమాచరణలు వేరే. లింగాయతుల ఆచరణలు వేరని సమాజముగుర్తించునట్టె చర్యలు చెపట్టిననే లింగాయత ధర్మమును విశ్వధర్మమునర్చుట సాధ్యము కాగలదు. లింగాయత ధర్మమునకు వీరశైవముతో ఏలాంటి సంభంధము లేదు అని మొదట లింగాయతులు తేలిసికొనిననే ఇతరులకు తేలిసివచును. తద్వారా లింగాయత ధర్మము విశ్వధర్మముగా గుర్తింపుబడయును.

సూచిక (index)
*
Previous బసవ వచన ఆచరణతో శరణత్వ సిద్ధి బసవేశ్వరుడు మన ధర్మగురు Next