లింగాయతంలో శరణులు అనుభావం చేయాలి (సంగం; శరణలు భక్తిపక్షం)


కాకి ఒక మెతుకగపడ్డా పిలువదా తన బలగాన్ని?
కోడి ఒక పురుగును చూస్తే పిలువదా తన కులాన్నంతా?
శివభక్తుడై భక్తిపక్షంగా లేకుంటే కాకి కోళ్ళకన్నా హీనం కదా?
కూడల సంగమదేవా! - గురు బసవన్న/152 [1]

జ్ఞానబలంతో అజ్ఞానానికి కీడు చూడవయ్యా
జ్యోతిబలంతో కారుచీకటికి కీడు చూడవయ్యా
సత్యబలంతో అసత్యానికి కీడు చూడవయ్యా
పరుసవేది బలంలో అవలోహాలకు కీడు చూడవయ్యా
కూడల సంగని శరణుల అనుభావ బలంతో
నా భవానికి కీడు చూడవయ్యా - గురు బసవన్న/207 [1]

జలారి నీరు తేటగా నుంటే మాత్రమేమి?
చెల్లని రూపాయి మరెక్కడుంటేనేమి?
ఆకాశ మామిడి పండైతే మాత్రమేమి?
కొయ్యలేదు మెయ్యలేదు
కూడల సంగుని శరణుల అనుభావం లేనివాడు
ఎక్కడుంటేనేమి? ఎలా వుంటేనేమి? - గురు బసవన్న/274 [1]

భక్తడు భక్తుని ఇంటికొస్తే భృత్యాచారం చేయాలి
కర్తగా కాళ్ళు కడిగించుకొంటే
మున్ను పూనిన భక్తికి హాని
లక్ష ఆమడలు దారిని పోయి
భక్తుడు భక్తుణ్ణి చూడటం సదాచారం
అక్కడ కలసి దాసోహం చేశారా
కలసుకొంటాడు మా కూడల సంగయ్య తానుగా - గురు బసవన్న/294 [1]

మూకుడు చేయాలంటే మొదట మన్నుండాలి
సింగారపు నగలకు మొదట బంగార ముండాలి
శివపథం గ్రహించానికి మొదట గురుపథం పట్టాలి
కూడల సంగమ దేవుని తెలియాలంటే
మొదట శరణుల సంగం కావాలి - గురు బసవన్న/310 [1]

సార సజ్జనుల సంగమది మంచిది కనుమయ్యా
దూర దుర్జనుల సంగమది భంగమయ్యా
సంగములు రెండుంటాయి. ఒకటి పట్టు రెండొ దొడగొట్లు
మంగళమూర్తి మా కూడల సంగని శరణుల సంగములు. - గురు బసవన్న/383 [1]

సారం సజ్జనుల సంగము సలుపదగినది
దూర దుర్జనుల సంగం వద్దయ్యా
ఏపామైతేనేమి? విషం ఒక్కటే
అలాంటివారి సంగం వద్దయ్యా
అంతరంగం శుద్ధంగా లేనివారి సంగం
హాలాహలం కాలకూట విషమొ కూడల సంగమదేవా. - గురు బసవన్న/384 [1]

తలమాసితే మహామజ్జనం చేయాలి
గుడ్డ మాసితే చాకళ్ళకు వేయాలి
మనసు మైల కడగాలంటే
కూడల చెన్న సంగయ్య శరణుల అనుభావం అభ్యసించాలి /862 [1]

సంగము నుండి కాక అగ్ని పుట్టదు
సంగము నుండి కాక విత్తు మొలకెత్తదు
సంగము నుండి కాక పూవు వికసించదు
సంగము నుండి కాక ఏ సుఖమూ అనుభవమునకు రాదు
చెన్నమల్లికార్జునయ్యా
మీ మహానుభావుల సంగంతో నేను
పరమ సుఖియైతినయ్యా -అక్కమహాదేవి/1227 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousలింగాయతంలో దేవుని స్వరూపంలోకపు వంకరలు మీరెందుకు దిద్దడం; మీమీ మనసులు సరిచేసుకోండిNext
*