లోకపు వంకరలు మీరెందుకు దిద్దడం; మీమీ మనసులు సరిచేసుకోండి

తనువు మీదన్న మీదట నాకు వేరే తనవు లేదు
మనసు మీదన్న మీదట నాకు వేరే మనసు లేదు
ధనము మిదన్న మీదట నాకు వేరే ధనము లేదయ్యా
ఇటులి త్రివిధాలూ మీవని తెలిసికొన్నాక
నాకు ఇతర విచారాలుంటాయా కూడల సంగమదేవా - గురు బసవన్న/208 [1]

పరచింతలు మనకేలనయ్యా మనచింతలు మనకు చాలవా?
కూడల సంగమదేవుడు ప్రసన్నుడయ్యాడో లేదో నన్నచింత
పరచుకోనూ వుంది కప్పుకోనూ వుంది - గురు బసవన్న/268 [1]

లోకపు వంకరలు మీరెందుకు దిద్దడం
మీమీ తనువులు సరిచూసుకోండి
మీమీ మనసులు సరిచేసుకోండి
పొరుగింటి దు:ఖానికి ఏడ్చేవారిని మెచ్చడు
మా కూడల సంగమదేవా! - గురు బసవన్న/352 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousలింగాయతంలో శరణులు అనుభావం చేయాలి (సంగం; శరణలు భక్తిపక్షం)లోకవిరోధి శరణుడెవరికీ బెదిరేవాడు కాడుNext
*