చుట్టి చుట్టి వస్తే లేదు లక్షగంగల్లో మునిగిన లేదు, మనస్సు శుద్ధి చేయాలి

తనువు బత్తలగా నుంటేనేమి శుచి కాకున్నంత వరకు
తల బొడైతేనేమి భావము బయలుకానంత వరకు
భస్మము పూసితే నేమి?
కరణాదుల గుణాల నొత్తి త్రొక్కి కాల్చనంత వరకు
ఇట్లాంటి ఆశల వేషపు భాషకు
గుహేశ్వరా నీవు సాక్షిగా ఛీకొడతాను. - అల్లమప్రభు/530 [1]

స్నానించి దేవుని పూజింతుననే సందేహి మానవా వినరోరీ
స్నానించదా చేప? స్నానించదా మొసలి?
తాను స్నానించి తనమనసు శుచికానంత వరకు
ఈ మాయల మాటలు మెచ్చునా మా గుహేశ్వరుడు. - అల్లమప్రభు/593 [1]

చుట్టి చుట్టి వస్తే లేదు లక్షగంగల్లో మునిగిన లేదు
కొట్టకొనల మేరుగిరినెక్కి కేకలిడిన లేదు
నిత్య నేమముతో తనువు తాకినా లేదు
నిత్యానికి నిత్యం తలచే మనసును
ఆనాటి కానాటికి అట్టిట్టు తిరిగే మనసును
చిత్తంలో నులుపగల్గితే నిర్మలమైన వెలుగు గుహేశ్వరలింగము - అల్లమప్రభు/625 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousఏ కాయకం(ఉద్యోగం) చేసినా సమానందేహమే దేవాలయంNext
*