లింగాయతంలో , స్వర్గ నరకాల నమ్మకం లేవు

దేవలోక మర్త్యలోకం అనేవి వేరుగా లేవు చూడండిరో
సత్యం చెప్పడమే (పలకడమే) దేవలోకం మిథ్య నాడటమే మర్త్యలోకం
ఆచారమే స్వర్గం, అనాచారమే నరకం
కూడల సంగమదేవా నీవే ప్రమాణం -గురు బసవన్న/231 [1]

దేవలోకం మర్త్యలోకములని వేరుగా ఉన్నాయా?
ఈ లోకంలోనే మళ్ళి అనంత లోకాలా?
శివలోకం శివాచారమయ్యా
శివభక్తుడున్న ఠావే శివలోకం
భక్తుని ముంగలే వారణాసి, కాయకమే కైలాసం
ఇది సత్యమయా కూడల సంగమదేవా! - గురు బసవన్న/232 [1]

కైలాసం మర్త్యలోకం అని అంటారు
కైలాసం అంటే ఎమిటో
మర్త్యలోకం అంటే ఎమిటో
అక్కడ నడత అంతా ఒక్కటే
ఇక్కడ నడతా ఒక్కటే
అక్కడ పలుకూ ఒక్కటే, ఇక్కడి పలుకూ ఒక్కటే
చూడండయ్యా అంటారు
కైలాసం వారే దేవర్కులని అంటారు
మర్త్యలోకం వారె మహాగణాలని అంటారు
సురలోకంలో వేయి ఏళ్ళకుకాని తుదిలేదని అంటారు
నరలోకంలో వచ్చి, వచ్చి పుడుతుంటారు
దీనిని చూసి మా శరణలు
సురలోకాన్ని, నరలోకాన్ని తృణమని భావించి
భవాన్నిచాటి తమ పుట్టుకను ఎగిరి,
మహావెలుగును కూడి వెలుగలో బయలయ్యారయ్యా
అప్పన్న ప్రియ చెన్న బసవన్నా -అడపం లింగమ్మ/1361 [1]

కరస్థలంలో లింగం ఉండగా
ఈ హస్తమే కైలాసం, ఈ లింగమే శివుడు
ఇది కారణం, ఇక్కడే కైలాసం
ఇది కాకుండా వేరే వెండి కొండయే కైలాసం అని
అక్కడుండే రుద్రడే శివుడని
కైలాసానికె వెళ్ళాను వచ్చాను అన్న భ్రాంతి వద్దు వినండన్నా
కాయంలోని అనుగ్రహ లింగంలో శ్రద్ధ లేకుండాపోతే
ఇంకెక్కడి నమ్మకం అయ్యా
అక్కడిక్కడకు చిందరవందరై చెడిపోకు వినండన్నా
అంగంలోని లింగాంగ సంగాన్నీ తెలుసుకుని
లోపలబయట ఒక్కటిగా
శిఖి సంగంలో కర్పూరం మంటలా అయ్యేట్టు
సర్వాంగంలో లింగం సోకి
అంగభావం చెరిగి, లింగభావం తన్మయం అయ్యే
తద్గత సుఖం ఉపమాతితం అయ్యా
సౌరాష్ట్ర సోమేశ్వరా. - ఆదయ్య/1482 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousలింగాయతంలో తిథి వారాలు, జాతకము నమ్మరుదేవలోకం మర్త్యలోకములని వేరుగా లేవు; భక్తుని ముంగలే వారణాసి, కాయకమే కైలాసంNext
*