జ్ఞాన పూర్ణం జగపుజ్యోతి

*

- ✍ శ్రీ సర్పభూషణ శివయోగులు
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

జ్ఞానపూర్ణం జగపుజ్యోతి

జ్ఞానపూర్ణం జగపుజ్యోతి
నిర్మలమైన మనమే కర్పూరహారితి ||ప||

అనుదినము గురువుతో గూడి భక్తితో
జనన మరణ రహిత జంగమమును వెలిగించుము ||అ.ప.||

నేను నీవనుటను వీడకున్న నరకమే ప్రాప్తి
జ్ఞానులతోడనాడుడు
స్వానుభవ సుఖమదే కైవశమగును
అనుభవించి లింగానికి మనమొప్పి వెలిగించుడు || 1 ||

నానాజన్మాల చీకటి ముసుగు
తానుగా బాధపడుచుండు!
హీన విషయాలకు వెనుకనుండి గురువుని
ధ్యానమే గతియని మనసొప్పి వెలిగించుడు || 2 ||

అష్టాపర్ల స్థూలము మానవ జన్మ
పుట్టి వచ్చుటయే దుర్లభము
ఇచ్చెను గురువుమనకు! ముడుచు ఫలమునుండి
పుట్టిన పుత్రునికి సిద్ధుని పేరుంచి వెలిగించుడు ||3 ||

*
సూచిక (index)
Previousజ్యోతి వెలుగుచున్నదిజయతు జయతు బసవగురుNext
*