శరణు బసవశరణు

*

- ✍ భీమకవి
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

శ్రీ గురువె దీక్షా గురువె...

శ్రీ గురువె దీక్షా గురువె
శిక్షా గురువె రక్షాగురువె
సర్వాగమోక్త కళాగురువె
శివయోగ ధర్మార్థ భోగ గురువె
త్యాగగురువె సుధీగురువే వాచాగురువె
భవ రోగహర కృపచూపు బసవ మహాగురువె || 1 ||

బసవశరణా పాపమును తొలగించు
బసవశరణా తాపమును తొలచు
బసవశరణుడా పరమపావన శాంతి నెలకొల్పు
బసవశరణుడా భక్తిప్రసాధించు
బసవశరణా కలిగించు సుస్థితి
బసవశరణా వచన రచనా సిద్ధిని వృద్ధిపఱచు || 2 ||

బసవశరణా భవముడుగును
బసవశరణుడా కీర్తి పెరుగును
బసవశరణా దుస్థితి సత్యముగా పాఱును
బసవశరణా సౌఖ్య మొదగును
బసవశరణా భాగ్యమొప్పును
బసవశరణా కామితార సిద్ది సిద్దించు || 3 ||

బసవశరణా శీలమొప్పును
బసవశరణా విమలమతిరం
జించును వెదజల్లు బసవ అక్షరత్రయము!
అను గ్రహించు బసవనామమొకసారి
పఠించిన వారి వచనము
రస నెలవై ఈశ్వరుడు తోడైయుండు || 4 ||

*
సూచిక (index)
Previousమాయాసాగరముకల్యాణ జ్యోతిNext
*