తల్లి భారతికి నుడికానుక.

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

భారతమాత జన్మదాత తల్లినీకు వందనాలు

భారతమాత జన్మదాత తల్లినీకు వందనాలు
నాబ్రదుకు కణకణాలు నీదుచరణాల కర్పణంబు ||ప||

పుణ్యలత గణ్యప్రీతి సత్కళాత్మ జ్యోతియే
మాన్య మూర్తి విశ్వకీర్తి త్యాగయోగ స్పూర్తియే
సుజల భరిత అమలచరితసస్య సంపద్భూషితే
సుభగగాత్రి సర్వప్రీతి విశ్వజన పూజితే || 1 ||

గౌరి శంకరగిరియు ధవళ మకుటమై నీకు
కన్యాకుమారిలోని శరధి అలలు కాలుంగురాలు
పసరువన పీతాంబర మొడలు చుట్టి మెఱుగుతెర
పుష్పరాశి విరియబారి సిరిముడికి శ్వంగారము || 2 ||

నీదునేల తొట్టిలలో నాడి పెరిగిన బిడ్డలు మేము
వీచి, యులియు చల్లనిగాడ్పుల జోలపాట విని సంతసించితిమి
మా బ్రదుకుతైలమై నీహృదయ దివియు వెలిగి
లోక మెల్లవెలుగు గాంచిముందడుగువేయ శివుని || 3 ||

శుకమై పికమై నీవనములో పాడెద సుఖముగా
నదియై తోరమై నీతొడపై ఆడువరము
సతతము నీవుకరుణించు జన్మమొకటియున్న
వందింతునందుకు నీకు సచ్చిదానంద మంగళా || 4 ||

*
సూచిక (index)
Previousనాడు మాతకు నుడి నైవేద్యము రాష్ట్ర భక్తిగీతముNext
*