బసవ జెండా (ధ్వజ) గీతము

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

షట్కోణ బసవ ధ్వజారోహణ తరువాత పాడు గీతము

ఓ! శరణ బంధువులారా బసవధ్వజ మెగురు చున్నది
శాంతి ధ్వని మ్రోగుచున్నది. రండి రండి రండి మీ రెల్లరు భేద భావము వదలిపుడు ||ప ||

జాతీయత తిమిరమును త్రోలి, ధార్మికతత్త్వము పట్టి
బసవ పతాకతత్త్వము తోడ ప్రకటించుచు. ||1||

ధర్మమే మనసద్ధర్మ ధర్మము మన మానవధర్మము
ధర్మమే మనరాష్ట్ర ధర్మము, ధర్మమే మన విశ్వధర్మము ||2||

బసవాది ప్రమథుల దివ్య పరంపర వారు
మనుకుల స్వాతంత్రమునకు పోరాడెదనను పంతమున్నవారు ||3||

మన బ్రతుకు కణకణాలు బసవపాదముల కర్పణము
మన చెన్న తనుమనములు నాడుగుడికి తర్పణము ||4||

జాతిమత పంతముల హీనభావము తుడిపెదము
భిన్న భేదములు మఱచి బ్రతుకు ప్రేమ భావము పెంచెదము ||5||

శాంతి స్నేహప్రేమ సమత నొప్పి బ్రదుకుదాము
బసవధర్మ ప్రమిదలకు బ్రతుకు తైలమును పోయుదాము ||6||

*
సూచిక (index)
Previousసంకల్పగీతము బసవ భక్తుల ప్రతిజ్ఞ Next
*