Previous చూడు చూడు చూడు లింగమా మాయాసాగరము Next

అకలంక గురువు

*

- ✍ శ్రీ ముప్పిన షడక్షరి దేవ
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

సకలమంతటికి నీవె అకలంక గురువనుచు

రాగము : శుద్ధసావేరి; ధ్వనిదరువు: కైవల్యగీత; తాళము : ఝంప

సకలమంతటికి నీవె అకలంక గురువనుచు
నిఖిల శాస్త్రము నుడువుచుండుట నెఱుగుదును .... ||ప||

అంచుకంబళి సిద్ధ వరలింగనామముతో
హరుడా నీవెనాకు దీక్షనొసగితివి !
వరషధాక్షర దేవుని నామము నుండినాకు
తెలిపితిరి శివ శాస్త్రమను భవమును ||1||

వారివారి దర్శనానికి వారి వారి వేషమందు
వారివారికెల్ల గురువీవొకడవే
వారివారి భావానికి వారివారి పూజకు
వారి వారికెల్ల దేవా నీవొక్కడవే ||2||

పోరాటము కల్గించి వేతైతివేకాక
వేజున్నదే జగమందున ఓదేవుడా !
పూర్తిగా తెలియరునిన్ను వేటైన పరిమితులను
మారారి శివ షడక్షరి లింగమా ||3||

*
సూచిక (index)
Previous చూడు చూడు చూడు లింగమా మాయాసాగరము Next