ఉళియుమేశ్వర చిక్కణ్ణ

మకుటం ఉళియుమేశ్వర

నేను భక్తుణ్ణి, నేను శరణుణ్ణి, నేను లింగైక్యుడనంటే
లింగం నవ్వదా?
పంచేంద్రియాలు నవ్వవా?
అరిషడ్వర్గాలు నవ్వవా?
నా శరీరంలోని
సత్వరజతమో గుణాలు నవ్వవా?
చెప్పయవయ్యా ఊళి ఉమేశ్వరా! /1592 [1]

వారణాసి, అవిముక్తి, ఇక్కడే వున్నాడు
మంచు కేదారుడు, విరూపాక్షుడు ఇక్కడే వున్నాడు
గోవర్ణ సేతు రామేశ్వరడు ఇక్కడే వున్నాడు
శ్రీశైల మల్లికార్జునుడిక్కడే వున్నాడు
సకళ లోక పుణ్యక్షేత్రుడు ఇక్కడే వున్నాడు
సకల లింగ ఉళి ఉమేశ్వరుడు తనలో వున్నాడు!/ 1595 [1]

ఉళియుమేశ్వర చిక్కణ్ణ: ఇతడు రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా దేవరగుడి గ్రామానికి చెందినవాడు. ఇక్కడి దేవుడు హుళియుమేశ్వరుడు అంటే ఈనాడు మల్లికార్జునడుగా పిలువబడుతున్నవాడు. కల్లెదేవర పుర శాసనంలో కనిపించే "చిక్క" అనువాడితడే కావచ్చును. దేవరగుడి గ్రామంలోని శాసనాల ద్వారా ఇతడు మూలత: కాళాముఖ శైవాచార్యుడని తెలియవస్తున్నది. "ఉళియుమేశ్వర" మకుటంతో ఇతని 12 వచనాలు లభించాయి. సంసార నిరసనం, శరణస్తుతి, నిర్వాణకాంక్ష, భృత్యభావం, ఉదారదృష్టి ముఖ్య విషయాలుగా ఈ వచనాలు అలబడినవి.

నా మనస్సు మంచం చేసి
నా తనువు పాన్పచేసి పరుసతాను రావయ్యా
నా అంతరంగంలో వుందువు రావయ్యా
నా బహిరమగంలో వుందువు రావయ్యా
నా శివలింగ దేవుడా రావయ్యా
నా భక్త వత్సలా రావయ్యా
ఓం నమ:శివాయ అని పిలుస్తాను
ఉళి ఉమేశ్వర లింగమా రావయ్యా! /1593 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousఉగ్ఘడించే/ఉగ్ఘడింపుల గబ్బి దేవయ్య ఉప్పరగుడి సోమిదేవయ్యNext
*