రాయసం మంచన్న

మకుటం జాంబేశ్వర
కాయకం: బసవన్నగారి పత్ర వ్యవహారలను చూసే కాయకం

కత్తి మొననే గట్టిగా పట్ట గలిగినపుడు
కత్తి ఏమి చేయ గలుగుతుంది
పాము నోరు తెరువకముందే దాని తలను పిడికిట బట్టితే
విషమేమి చెయగలుగుతుంది
మనసులో వికారాలు తలెత్తక మునుసే,
మనసులో మహము నిలుపగలిగితే
ఇంద్రియాలేమీ చేయలేవు జాంబేశ్వరా! /2022 [1]

రాయసం మంచన్న: ఇతడు కల్యాణ నగరంలో బసవన్నగారి పత్ర వ్యవహారలను చూసే ఒక నియూగి బ్రాహ్మణుడు. భార్య రాయమ్మ. కాలం క్రీ. శ. 1160. "జాంబేశ్వర" అంకితముద్రతో 10 వచనాలు రచించాడు. అవి సరళంగాను, సలలితంగానూ వుండి ఇష్టలింగ మహాత్మ్యం, మనోవికారం, ఇంద్రియ నిగ్రహం, తెలివిడితనం, ఆచారాలను గురించి వివరిస్తాయి. వాడుకున్న పోలికలు, ఉపమలు అద్భుతంగా వున్నాయి.

వ్రాసి మళ్లీ తుడిపితే ఆ వ్రాత శుద్ధం కాదంటాను
ఎరుక గల్గి మళ్లీ మరచిపోతే అది ఎరుకకు భంగమంటాను
చచ్చిన పిదప సముద్రమూ ఒకటే, గుక్కెడు నీరు ఒకటే జాంబేశ్వరా /2023[1]

మరాళం పాలునీరు సంగమంలో
నీరువదలి పాలనే గ్రోలే భేదం చూడుమా
నూనె నీటితో కూడినప్పుడు అది తనవల్లనే వ్యాప్తమై
అది చక్కగా మండే విధం చూడుమా
మంటిలోంచి వచ్చిన బంగారం మట్టిని తప్పించుకొని
వెలపెరిగిన భేదం చూడుమా
తనలో తానుండి తనను తెలుసుకోక
రోదించే విన్నాణము కనుమా!
బాగా శ్రమించే అన్నలందరూ పసిడి, కాంత, మట్టి వీటి వలలో చిక్కి
నీధులున్న అన్నల వాకిళ్ళలో నిలిచి
రంగు మాసిన వారిని చూచి
నవ్వుకొంటున్నాడు జాంబేశ్వరా. /2024 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousసగరద బొమ్మణ్ణప్రసాది లెంకబంకన్నNext
*