మోళిగె (కర్రల) మారయ్య

మకుటం ని:కళంక మల్లికార్జునా
కాయకం: కాశ్మీరదేశపు ప్రభువు, కట్టెలకొట్టి తెచ్చి అమ్మి జీవించే కాయకం.

రాతిలో మట్టిలో చెట్టులో దేవుళ్ళున్నారని
ఎక్కెడెక్కడో యాతన పడే అన్నలారా వినండహో
అవన్ని అక్కక్కడ వుంచిన ఘనతకు గురుతేకాని
ఆతడు మాటల కతీతుడయ్యా
మనసెక్కడ వుంటుందో అక్కడే ఆతని వునికి
ని:కళంఖ మల్లికార్జునా/1981 [1]

మోళిగె (కర్రల) మారయ్య: ఈయన కాశ్మీరదేశపు ప్రభువు. అసలు పేరు మహాదేవ భూపాలుడు. భార్య పేరు గంగాదేవి. బసవన్న గొప్పతనాన్ని విని మెచ్చి రాజ్యాన్ని త్యజించి ఇద్దరూ కల్యాణానికి వచ్చారు. మహాదేవి-మారయ్యలను పేర్లు ధరించి కట్టెలకొట్టి తెచ్చి అమ్మి జీవించే కాయకం. ఎన్నుకొని శరణధర్మాశ్రయ జీవనులైవుంటారు. వీరి కాయక నిష్ఠ, ధృఢదీక్ష, శూన్య సంపాదనలో ఒక కథకు మూలధాతువులైనాయి. కాలం క్రీ.శ. 1160. "ని:కళంక మల్లికార్జునా" అనే మకుటంతో ఈయన రచించిన 808 వచనాలు సంకలితమైనాయి. వైవిధ్యమయంగా తాత్విక, ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక, అనుభావిక వస్తువిషయాలను గురించిన ఈ వచనాలు మారయ్యగారి విద్వత్తు, ఆధ్యాత్మిక నిలువు. అనుభావపు ఔన్నత్యం, సామాజిక సంవేదన, సాహిత్యక శ్రీమంతతనం ప్రస్ఫుటంగా ప్రదర్శిసుతన్నాయి.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousముక్తాయక్కమోళిగె మహాదేవిNext
*