మేదర కేతయ్య

మకుటం గవరేశ్వర

భక్తుడికి సుఖమా ఒకటే దు:ఖమా ఒకటే!
మంట పంటా ఉభయమూ ఒకటే
అట్లవకుంటే భక్తునికే హాని
జంగమమని ప్రమాణీకరించి
తన కళ్ళముందే ఎవరెవరినో భజించటానికి
తన అంగము వినియోగిస్తే
తీర్థప్రసాదాలకు అతడేవుడో కడుదూరమా గవరేశ్వరా. /1961 [1]

మేదర కేతయ్య: బుట్టలల్లు కాయకం చేపట్టిన ఇతని స్వస్థలం బేలూరు సమీపంలోని ఉళవిబెట్ట. భార్య సాతమ్మ. కాలం క్రీ.శ.1160. 'గవరేశ్వర" అంకితంలొ రచించిన 11 వచనాలు దొరికినాయి. వాటిలో సమకాలీన శరణులస్థుతి, తన కాయకపు రీతి-నీతి-మహత్వం తద్వారా పడసిన లింగాంగ సామరస్యపు సుఖాన్ని చక్కగా వర్ణించడం జరిగింది.

పెట్టుబడి లేక లాభ ముంటుందా?
నిరీక్షణ లేక పరీక్ష వుంటుందా?
గురువు లేక లింగముంటుందా?
ఇలాంటి వేషభాషలకు రోసిపోయాను కనుమా గవరేశ్వరా. /1962 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousమెరెమిండయ్యమరుళశంకరదేవుడుNext
*