ఏకాంతరామి తందె

మకుటం ఎన్నయ్య (నాఅయ్య) చెన్నరామ

*

తనువుల్లో భేదాలుండి
ఆత్మ ఒకటే అనడం అదెట్టిమాట
నిప్పుతో వచ్చిన వెలుగు కాల్చగలదా నిప్పు లేకుండా?
కొన్ని ఘటాల్లో వారివారి దారుల్లో అనుభవిస్తూ
మరొక దానిలో కూటస్థమైన సుఖం వుంటుందా?
ఈ గుణం నా తండ్రి చెన్న రాముని తెలుసుకొన్నప్పుడే! /1600 [1]

ఏకాంతరామి తందె: హరిహరుని రగడలొనూ, అబ్బలూరి శాసనంలోనూ ఉల్లేఖితుడైన ఇతని నెలవు గుల్బర్గా జిల్లాలోని ఆళంద గ్రామం. తండ్రి-పురుషోత్తమభట్టు, తల్లి-సీతమ్మ, కార్యక్షేత్రం-అబ్బలూరు, కాలం క్రి.శ.1160, పులిగెరె సోమేశ్వరుడు కలలో కనిపించి చెప్పిన మేరకు పరసమయులను జయించడానికి అబ్బలూరు వస్తాడు. జైనలతో వాదమునకు నిలిచి అక్కడి బ్రహ్మేశ్వర దేవాలయంలో మహిమ ప్రదర్శించి జైనుల బసదిలో సోమేశ్వరుణ్ణి స్థాపిస్తాడు. ఈ సన్నివేశం అబ్బలూరు శాసనంలో వర్ణింపబడింది. ఈ సంఘటనా దృశ్యాలు వివిధ శిల్పాలుగా దేవాలయ గొడలపై చెక్కివుండటం చూడవచ్చును.

అశనం, వ్యసనం, సర్వ విషయాలలొ మునిగిపోయి
పిసినిగొట్టుతనంతో నసుగుతూ
చేసే పూజతో సద్గురువుకి సంబంధం లేదు
నువులనూనె - నీటి బేధంలా
ముత్యంలోని - దారంలా
కుప్పుసం వదిలిన పాము శరీరంలా
గురుస్థల సంబంధం
నా తండ్రి చెన్నరామేశ్వర లింగమును తెలుసుకోగల్గితే /1599 [1]

ఈతనివి ఏడు వచనాలు లభించి అవి ఎన్నయ్య (నాఅయ్య) చెన్నరామ మకుటంతో వున్నాయి. గురుస్థల సంబంధం, కాయ-జీవ భేధం, నిత్య ముక్తుని స్థితి, మనసులేని విరక్తుని గూర్చిన విడంబన ఇందులో రూపకట్టాయి.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousఎడెమఠ నాగిదేవయ్య గారి పుణ్యస్త్రీ మసణమ్మఎలెగార (ఆకుల) కామణ్ణNext
*