బాలసంగయ్యా

మకుటం అప్రమాణ కూడలసంగమదేవు

ఈ వచనాను భావము నందున్న అర్థము
సకల వేదాగమశాస్త్ర పురాణాల్లోనూ ఉన్నది గనుమా
ఈ వనాను భావార్థము
సకల వేదాగమ శాస్త్ర పురాణాల్లోనూ లేదు కనుమా
ఈ వచనాను భావార్థము
సకల వేదాగమ శాస్త్ర పురాణాలకు అందదు గనుమా
ఈ వచనాను భావార్థము
సకల వేదాగమ శాస్త్ర పురాణాతీసము గనుమా
అప్రమాణ కూడల సంగమదేవా. /2441 [1]

బాలసంగయ్యా: ఇతడు బసవోత్తరకాలంలో ఒక గొప్ప వచనకారుడు. తోంటద సిద్ధేశ్వరుల కన్న పూర్వుడులా కనపడుతున్న ఇతని వివరాలు ఏమీ తెలియవు ఇతని అసలు పేరు "అప్రమాణదేవుడు".

నాదేహం అనే ప్రాకారంలో
మనస్సనే శివాలయం గనుమా
మనస్సనే శివాలయంలో
చిద్రూపమనే సింహాసనం గనుమా
చిద్రూపమనే సింహాసనం మీద
చిత్ప్రకాశమనే లింగం నెలకొల్పి
నిశ్చింత అనే హస్తమును తాకి పూజించగా
భవమాల తెగి భవరహితుడైతిని కనుమా
అప్రమాణ కూడల సంగమదేవా /2443

రాతిదేవుడు దేవుడుకాడు
మట్టిదేవుడు దేవుడుకాడు
కొయ్యదేవుడు దేవుడుకాడు
పంచలోహాలతో చేసిన దేవుడు దేవుడుకాడు
సేతురామేశ్వరము, గోకర్ణము, కాశి, కేదారము
మొదలైన అష్టావష్టి కోటి (86 కోట్ల) పుణ్యక్షేత్రాలు లోనున్న
దేవుళ్ళు దేవుళ్ళు కారు
తన్ను తానెరిగి తానేమని తెలిసిన
తానేపో దేవుడు చూడుమా
అప్రమాణ కూడల సంగమదేవా! 2444

ఈతని కృతి పేరు "సకలాగమ శిఖామణి". "అప్రమాణ కూడలసంగమదేవు"ని అంకితగల 920 వచనాలు ఈ కృతిలో సంకలితమయ్యాయి. ఇదొక సంపూర్ణ తాత్విక శాస్త్రకృతి. చెన్న బసవాదులు చెప్పిన లింగాయత ధర్మ తత్వాలను వ్యవస్థితంగా ప్రతిపాదించడమే ఈ వచనాల పరమొద్దేశం. సృష్టి ఉత్పత్తి నుండి మొదలుకొని లింగాంగ సామరస్యం వరకు గల విషయాలు, ఇక్కడ అనేక ఉపశీర్షికల క్రింద వివరింపబడినవి. అప్రమాణదేవుడొక ఉద్దామ పండితుడు, శ్రేష్ఠ అనుభావి అనడానికి ఈ వచనాలు సాక్షిగా నిలుస్తాయి.

బ్రహ్మా-దేవుడుగాడు విష్ణువు దేవుడుకాడు
ఈశ్వరుడు దేవుడుకాడు సదాశివుడు దేవుడుకాడు
సహస్రశివ, సహస్రాక్ష సహస్ర పాదుడైన విరాట్పురుషుడు దేవుడుకాడు
విశ్వతోముఖ, విశ్వతోచక్షు, విశ్వతోబాహు
విశ్వతోపాదుడైన పరమపురుషుడు దేవుడుకాడు
సహజ నిరాలంబమే తానని తెలిసిన మాహాశరణుడు తానే దేవుడు కనుమా
అప్రమాణ కూడల సంగమదేవా/2453 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousబహురూపి చౌడయ్యబాచికాయకపు బసవన్నగారి పుణ్యస్త్రీ కాళమ్మNext
*