అప్పిదేవయ్య

మకుటం ఈశ్వరీయ వరద మహాలింగ

మగువ - మన్ను - కనకాలను విడిపించని గురూపదేశాన్ని నేనొల్లను
రోషాన్ని, హర్షాన్ని, చెరపని లింగాన్ని పూజించను
తామస భ్రమను మాపని జంగమానికి దాసోహం చేయను
పరమానందం కాని పాదోదకాన్ని తీసుకోను
పరిణామంలేని ప్రసాదాన్ని తినను
నేననేదాన్ని చెపని ఈశ్వరీయ
వరద మహాలింగాన్ని ఏమని అనను. / 1421 [1]

అప్పిదేవయ్య: కాలం క్రి.శ. 1650. ఈశ్వరీయ వరద మహాలింగ మీతని అంకితముద్ర. ఒక్క వచనమే లభించింది. నేను అన్నది తుడిచిపెట్టని గురులింగ జంగమాల ప్రసాదాన్ని వద్దని నిరాకరించే స్తైర్యం ఇందులో అందంగా తెలుపబడింది.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం:డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousఅనామిక నాచయ్యఅంబిగర చౌడయ్యNext
*