శివాచారము (సామాజిక సమత)

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

“భక్తరల్లి కులగోత్ర జాతి వర్ణాశ్రమవనరసద అవరోక్కుద్ర కొంబుదే శివాచార”

శివాచారము సామాజిక సమతను భోదించు తత్వము. జగత్తునందలి మానవులందఱు ఒక దేవుని బిడ్డలు., ఈ మానవ జనాంగమునందు అడ్డగోడను నిర్మింపరాదు. వర్ణాశ్రమ ధర్మముచేయు వర్గీకరణము జన్మవలననే బ్రాహ్మణత్వ, క్షత్రియత్వ, వైశ్యత, శూద్రత్వములు వచ్చునని చెప్పును. ఈ కట్టు బాటులను శరణులు - దేవనిర్మితము కాదు; మానవ కల్పితమని తెలిసి, జగత్తునందు కేవలము రెండే జాతులు ఆడ, మగ, రెండే కులములు భవి - భక్తుడు అనునవి అని చెప్పిరి. ఈ తత్వముయొక్క ఆధారమునుబట్టి జాతి - వర్ణ - వర్గ - లింగ భేదము లేకుండ మానవులందఱు గురువుయొక్క అనుగ్రహమును పడసి ముక్తి పోందుటకు హక్కుగలవారు అను తత్వమును ఒప్పుకొనువాడే లింగాయతుడు.

ఆడది మాయకాదు, శూద్ర స్త్రీ కాదు. ఆమెయు ముక్తియభిలాషగల ధర్మమార్గపథికురాలు అని తెలిసి, పురుషునివలె ఆమెకును సమానముగ లింగదీక్షా సంస్కారమును ఇచ్చుచుండునట్లుగను, అర్హులైనవారికి, అపేక్షగలవారికి గురుత్వపు హక్కును, మఠపీఠము అధికారములను ఇవ్వవచ్చునను పూర్ణవిశ్వాసము, స్వతంత్ర విచారము కలవాడే లింగాయతుడు.

లింగదీక్షను ఏ జాతివానికైననూ ఇవ్వవచ్చును. కొంతమంది స్వాములు, మఠాధికారులు లింగవంతులు కానివారికి దీక్షనిచ్చుటకు వీలుకాదని దీక్షనిచ్చుటకు వెనుకంజవేతురు. ఇది అత్యంత మూర్ఖవిచారము. అన్ని జాతులవారికి దీక్షనిచ్చుటకే లింగాయత ధర్మము పుట్టినది. నిజమైన లింగాయతులకు ఈ లింగధారణచేయుట కాదు. లింగములేనివారికే లింగధారణచేయవలెను. రోగము కలవానికి చికిత్స చేయక ఆరోగ్యవంతునికి చికిత్సయా? భర్తలేని కన్యకు లగ్నమేకాని భర్తగల ముతైదువకు లగ్నముకాదు. కేవలము కొన్ని వర్ణములవారి సొత్తుగానుండిన ధర్మమును అందరి పాలికి వచ్చునట్లు చేయుటకే లింగాయత ధర్మము పుట్టినది., ఒక దీపము వెలుగుటకు కావలసినది ప్రమిద, వత్తి, తైలము. కాయమను ప్రమిదెయందు భక్తియను తైలము, ఆచారమను వత్తివున్న చాలును. ధర్మసంస్కారముతో దీపమును వెలిగించిన జ్యోతి ప్రకాశించియే తీరును. ఈ లింగదీక్షను తీసికొన్నవారి పూర్వజాతి ఏదైనవుండని దీక్షానంతరము అది తొలగిపోవును. దీక్షానంతరము మరల జాతిని వెదుకరాదు. వెదకినచో అది ధర్మద్రోహము, కడపాతకము.

గురుహస్తవొళు పునర్జాతనాద భక్తనల్లి
ఆవ జన్మజాతియ బెదకలప్పదు!
అవెల్ల ప్రాకృతరిగల్లదే అప్రాక్తతరిగుంటే హేళా
నాక్షి - అప్రాకృతస్య భక్తస్య గురుహస్తామలాంబుజాత్
పునరాతస్యాత్మ జన్మ జాత్యాదీన్న కల్పయేత్
ఎంబ ఆగమనవనరియదె, నిమ్మ శరణరల్లి జాతీయ
హుడుకువ
కడుపాతకిగళ ఎన్నత్త తోరదిరయ్యా
హడల చన్న సంగమదేవా (చ.బ.వ. 205)

అగ్నియందు వేయబడిన కట్టెలు మండినప్పుడు వాని భిన్నత తొలగును. అప్పుడు మిగులునది భస్మము మాత్రమే. అట్లే గురుదీక్షాగ్నియందు సాధకులు ధగ్ధమైనప్పుడు వారి పూర్వజాతి పోయి మిగులనది "కేవల లింగవంత తత్వము”.

సాధక దెసెయల్లి కులవనరసబహుదల్లదే
సిద్ధదెసెయల్లి అరసబహుదె?
హలవు జాతియ కట్టగెయ సుట్టల్లి అగ్నియొందల్లదే
అల్లి కట్టిగెగళ కురుహ కాంబుదే?
శివజ్ఞానసిద్దరాద భక్తరల్లి పూర్వజాతియనరసువ
అరె మరుళరనేనెందేనయ్యా
కూడల చన్న సంగమదేవా. (చ.బ.వ. 245)

ధర్మసంస్కారముచే జాతులు పోయి సమానత అలవడును. అని తెలిసినపిదప దీక్ష పొందినవారిని సమరసముచేసికొనవలెను. వారితోబాటు భుజించుట వ్యవహరించుట అను క్రియాచారము, కన్యకను కొనుట ఇచ్చుట అను కులాచారము రెండటిని నిస్సంకోచముగ చేయవలెను.

కొందరు కొత్తగా దీక్షగైకొన్నవారితో కూడా భోజనము చేయుటకు సంసిద్ధలగుదురు. కాని రక్తసంబంధ వివాహమునకు సిద్ధపడరు. ఇది తప్పైన ఆచరణము. వారితోబాటు పూర్ణ సామరస్యమును పోంది. జాతిబంధమును పెంచుటయే లింగాయత ధర్మ కర్తవ్యము. అందుకే బసవణ్ణగారు ఇట్లు చెప్పుదురు.

కుడిచి కట్టుటలో కట్టుచేడె నందురు;
ఇచ్చి పుచ్చుకొనుటలో కులము నెంతురు;
భక్తులను ఏట్లయ్యా? వారిని యుక్తులనుటెట్లయ్యా ?
కూడలసంగా వినవయ్యా ముట్టుత శుచిజలముల
మునిగినట్లయేనయ్యా! (బ.షవ 627)

ఏ కులమైననేమి, శివలింగము కలవాడే కులజుడు:
కులము నెంతురే శరణులందు; జాతి సంకరుడైన వెనుక?
“శివే జాతకులే ధర్మ పూర్వ జన్మచివర్జితః
ఉమా మాతా పితారుద్రో ఈశ్వరః కులమేవచ"
అని ప్రసాదముకొని బ్రతుకువారికి బిడ్డ నిత్తు
నమ్మొద నీ శరణుల కూడల సంగమ దేవా (బ.ష. వ 716)

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
Previousలింగాయత సిద్ధాంతముషట్ స్థల దర్శనముNext
*