గురువు - జంగముడు

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

ఏదైననొక తత్వసముచ్చయము ధర్మమని అనిపించుకొనవలెనన్నవుండవలసిన ఏకాదశ లక్షణములను లింగాయత ధర్మము పొందియున్నదను విషయము తెలియ చేయబడినదిగదా. వీనిని ధార్మికము, సామాజికము, ఆధ్యాత్మికము అని విభజింపవచ్చును. ధార్మిక విభాగమునందు అష్టావరణములు, సామాజిక విభాగమునందు పంచాచారములు, ఆధ్యాత్మిక విభాగమునందు షట్ స్థలములు వచ్చును.

అన్య సమాజమునుండి లింగాయతుని వేరుచేసి గుర్తించుటకువుండు లాంఛనములే అష్టావరణములు. గురువు, లింగము, జంగముడు - ఇవి పూజ్య వస్తువులు. విభూతి, రుద్రాక్షి, మంత్రము - ఇవి పూజ్యవస్తువులను తృప్తిపర చుటకువుండు సాధనములు. పూజకుడు పూజ్యవస్తువులను పూజించినపుడు దొరకు ప్రతిఫలములనగా పాదోదక ప్రసాదములు, అష్టావరణములందు మొట్టమొదట వచ్చు తత్వమనగా గురుతత్వము. గురువులేక అనుగ్రహమూ లేదు, లింగము లేదు. మిగిలిన ఏ ఆచరణములు లేవు. గురువువలన అనుగ్రహమును పడయక వుండువానిని లింగాయతుడు అనునది ఎట్లనగా తలలేకుండా కేవలము మొండెమునకు పటముకట్టినట్లగును. నిరాకారుడైన పరమాత్మ, మానవుని మనస్సు సులభముగ తననుగ్రహింపదని తెలిసి గురులింగ జంగముల రూపమునందు భక్తునియొద్దకు వచ్చును. భక్తత్వ, గురుత్వ, జంగమత్వములు పుట్టుకతో వచ్చిన జాతులుకావు, స్వప్రయత్నమువలన పొందిన అర్హతలు (Qualifications) అని లింగాయత ధర్మశాస్త్రము ప్రకటించును. ఇవి జాతివాచక శబ్దములుకాక ఆధ్యాత్మిక ఆరోహణముయొక్క అవస్థాత్రయములు. ఈ శబ్దములను ఒక వ్యక్తికి అన్వయింప చేయవలెనన్న అతనియందు కొన్ని అర్హతులు వుండవలసివచ్చును. అంగమునందు సదాచారమును ఏర్పరుచుకొని ఇష్టలింగపూజ చేయు శక్తికలవాడు భక్తుడు, మనస్సునందు తెలివిని తెచ్చుకొని ప్రాణలింగ ధ్యానము చేయు సామర్థ్యమును గడించినవాడు గురువు; ఆత్మసంగమునందు అనుభావమును తెచ్చుకొని భావలింగముయొక్క అనుసంధానమును చేయు శక్తిని సంపాదించినవాడు జంగముడు. ఇట్లు గురు-జంగమలనగా అత్యున్నత స్థితిని సంపాదించుకొన్న మహంతులు. షట్ స్థలమునందు "భక్తుడు మహేశ స్థలమునందున్నవాడు భక్తుడు, ప్రసాది ప్రాణలింగ స్థళమునందున్నవాడు గురువు, శరణ ఐక్యస్థళమునందున్నవాడు జంగముడు. గురువనగా పథవృత్తమునందు నిలిచి చేయిచూపి “ఈ దారియందు పొమ్మునీవు గురిచేరువవు" అని మార్గదర్శనము చేయువాడు. జంగముడనగా తానప్పుడే గురిచేరివచ్చి మరల సహపథికుడై మారమునందు పిలుచుకొని పోవువాడు.

జంగమపదము శరణధర్మమునందు అత్యున్నత తత్వము. జనన-మరణ గమనములను శూన్యము చేసుకొన్నవాడే జంగముడు. ఇది కూడా జాతివాచక పదముకాకుండ జంగముడనగా, స్వరూపసాక్షాతారము చేసికొన్న అనుభవి, స్ఫురణాత్మకజ్ఞాని, ధర్మప్రసారకుడు, అను విధముగ అర్థమునిచ్చును. శ్రీ అరవిందులు చెప్పునట్టే అతిమానవుని వ్యక్తిత్వమును బింబింప చేయును. కావున కొందరు అపార్థము చేసినట్లుగా జంగమపదమును జాతివాచకమని వాడుకొనుట మహాపరాధము. అందువల్లనే చన్నబసవణ్ణగారు ఇటు చెప్పుచున్నారు -

జాతివిడిదు జంగమవ మాడబేకెంబ పాతకరు నీవు కేళిరో;
జాతి ఘనవో, గురుదీక్షే ఘనవో ?
జాతి ఘనవాద బళిక, ఆ జాతియే గురువాగిరబేకల్లదే
గురుదీక్షె పడెదు, గురుకరజాతరాగి
జాతకవ కళెదు, పునరాతరాదేవెంబుద
ఏతక్కె బొగళువిరో?
జాతివిడిదు కళెయిత్తే జాతిమతవు?
ఆజాతంగె ఆవుదు కుల?
ఆవ కులవాదొడేను, దేవతొలిదాతనే కులజ.!
అందెంతెందడి -
దీయతే జ్ఞానసంబంధః క్షీయతేచ మలత్రయం |
దీయతే క్షీయతే యేన సాదిక్షేతి నిగద్యతే ||
ఎంబుదనరితు జాతినాల్కు విడిదు బంద
జంగమవే శ్రేష్ఠవెందు
అవనొడగూడికొండు నడెదు జాతి ఎంజలుగళ్ళరాగి
ఉళిద జంగమవ కులవనెత్తి నుడిదు
అవన అతిగదు
కులవెంబ సర్ప కచ్చి ఎంజలెంబ అమేధ్యవ భుంజిసి
హందినాయియంతే ఒడల హోరేవ దరుశన
జంగుళిగళు జంగమపథకె సల్లరాగి
అవరిగే గురువిల్ల గురుప్రసాదవిల్ల
లింగవిల్ల లింగప్రసాదవిల్ల
ఇంత త్రివిధ ప్రసాదక్కె హోరగాద నరజీవిగళ
స్వయచరపరవెందారాధిసి, ప్రసాదవ కొళ్పుదు
సల్లదు కాణా కూడల చన్నసంగమదేవా (చ.బ.వ 600)

గురుత్వస్వామిత్వములు జాతివలనరాకుండ త్యాగ - వైరాగ్య - సద్భక్తి - తపస్సులవలన వచ్చును. లింగదీక్షను పొందినవాడెవడైననూ పూర్వజాతిని వదలి పునర్చన్మమును పొంది సదుణములను ఆత్మశక్తిని ఉపయోగించుకొన్నవాడు గురువు కాగలడు, జంగముడు కాగలడు, స్వామి, మతాధికారి కాగలడు. కావుననే చన్నబసవణ్ణగారు ఇట్లు చెప్పుచున్నారు -

దేహనామ సొగసదు లింగాయతంగె
మానవనామ సొగసదు జంగమభక్తంగే
అన్ననామవనరియ ప్రసాద సమ్యక్కాగి
ఈ త్రివిధవేకార్డవాయిత్తు
కూడల చన్నసంగా, నిమ్మ శరణంగె (చ.బ,వ. 1275)

దేహాభిమానమును పోగొట్టుకొన్ననే లింగాయతుడు; జాతిస్మరణను మానవ కామనను పోగొట్టుకొన్ననే జంగముడు. తాను భుజించునది. పదార్థము కాదు; శివ ప్రసాదము అని తెలిసికొన్నవాడే ప్రసాది. ఇట్లు ఇవి సాధించిన ఉన్నతులు.

వ్యక్తిగత సంబంధముతో గురు - జంగమ తత్వముల వివేచన చేసినచో అప్పుడొక విషయము తెలియరాగలదు. గురువనగా ఒక విశిష్ట వ్యక్తియొక్క ఆజ్ఞానమును పోగొట్టినవాడు, అతనికి అనుగ్రహమునిచ్చి లింగాంగ సంబంధమును చేసినవాడు. గురువును వదలి మిగిలిన స్వాములందరూ మహాత్ములు (జంగములు), దీక్షను పొందిన ప్రతియొకడూ తనకు అనుగ్రహము సాధించినవారిని గురువనియూ, ఇతర మహంతులను జంగమలనియూ భావింపవలెను. లేకున్నచో ప్రతియొక్క గురువువల్లనూ ఒకొక పథము ఉద్భవించి నూరారు ఉపపథములై (lococults) సమాజమునందు మధుర బాంధవ్యము నిలువదు. కొందరు స్వ - గురు పూజకులు పరగురునిందకులు అయియందురు అట్టివారిని గూర్చి చెన్న బసవణ్ణగారిట్లు చెప్పుదురు -

గురులింగదల్లి పూజేయమాడి
జంగమలింగదల్లి ఉదాసీనవ మాడిదడే
గురులింగ పూజకరిగే శివదూతర దండనే
ఎంబుద మాడిదే అయ్యా,
లోకద కర్మిగళిగె యమదూతర దండనే
ఎంబుద మాడిదే అయ్యా,
భక్తియనరియరు, యుక్తియనరియరు,
కూడల చన్నసంగమ దేవా (చ.బ.వ - 925)

శిక్షయందు రెండు విధములు - ఒకటి యమదూతల దండనము. మరియొకటి శివదూతల దండనము. పరమాత్మయందు విశ్వాసమును వుంచక నాస్తికులై విషయలోలుప్తలైనవారికి యమదూతల దండనయట; ధర్మవంతులై దీక్షాది సంసారములను పొంది పూజాది సత్క్రియలను చేసియూకూడ అన్యమహాత్ములను జంగములను నిందించువారికి శివదూతుల దండనయట. నిజమైన ఆధ్యాత్మజీవి ఎవరనగా అన్నింటిని పూజ్యతతో చూచి విశాలదృష్టిని ఉపయోగించుకొన్నవాడు.

మరియొక అర్థమునందు జంగమమనగా చరించు చైతన్యము - నడెలింగ మనువ్యవహారము. అయితే ధర్మప్రసారముయొక్క కార్యభారమునువహించి ఊరినుండి ఊరికి సంచరించి బోధచేయువాడు అయితే ధర్మము శిథిలమైన ఈ కాలమునందు జంగములను గుర్తించు విధానము కూడా తెలియక జనులు అడ్డపల్లకిని ఎక్కునట్టి, బంగారపు కిరీటమును ధరించినట్టి ఆడంబరముతోనున్నటి వ్యక్తులను గౌరవించుచున్నారు. జంగముని లక్షణము ఇవి ఏమియూ కాదు. ఇది జ్ఞానప్రసారకులను కొందరు సామాన్యులనియూ యాచకులనియూ భావింతురు. తమంతటి తాము జనతకు ధర్మప్రసారము చేయుటకై వచ్చుకారణముగ వారు సామాన్యులని తెలిసికొందురు. ఇది దృష్టికోణమును శరణులు కటువుగా విమర్శింతురు.

షోడశ కళెయుళ్ళ జంగమన రాజరు పూజిసువరు;
విషయవుళ్ళ జంగమన వేశియరు, పూజిసువరు;
వేషవుళ్ళ జంగమర భక్తరు పూజిసువరు;
జ్ఞానవుళ్ళ జంగమ ఆరిగూ కాణబారదు;
కూడల చన్నసంగమదేవా (చ..వ 208)

జ్ఞానముయొక్క సాకారమూర్తులై ధర్మరక్షణకొరకు తమంతటతాము శ్రీసామాన్యులయొద్దకు వచ్చు నిస్వార్థులను సామాన్యులు యాచకులు అని లెక్కించు దృష్టిని వదలి జ్ఞానముయొక్కజ్యోతిని పొంది వచ్చు వీరే సమాజమునకు హితచింతకులు అని తెలిసికొను దృష్టికోణ సమాజమునందు పెరుగవలెను. అందులకే బసవణ్ణగారు ఈ రీతిగా చెప్పుచున్నారు

తిరుకరెన్నది భో ఎన్న తందెగళను
తిరుకరెన్నదిరి భో ఎన్న బంధుగళను
తిరుకరెన్నదిరి భో ఎన్న ఒడెయరను
దేహి ఎందెడె నాస్తి ఎంబవర బేహు
నోడబంద కాణా, కూడల సంగమదేవా (బ,షహ.వ 1152)

ఇటి దృష్టికోణము వచ్చినచో అనేక నిస్వార్థ త్యాగజీవి సాధకులు సమాజ సేవకు ఉత్సాహముతో ముందుకు వత్తురు.

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
Previousలింగాంగయోగం, త్రాటక యోగం, (శివయోగము)లింగాయత పరంపర (Heritage)Next
*