బసవాచారము - ధర్మగురునిష్ఠ

(సమాజ సంఘటనా సూత్రములు)

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

జనులతో కూడినదంతయు సమాజము అనుటకు వీలుకాదు. ఏదైన ఒక సముదాయము సువ్యవస్థిత సమాజమని అనిపించుకొనవలెనిన దానికి కొన్ని సూత్రములుండవలెను. ఆ సూత్రములు సామరస్యముగ సమాజమును బంధింపవలెను. ధర్మగురువు, ధర్మ శాస్త్రము, ధర్మక్షేత్రములు సమాజమును సువ్యవస్థితముగ బంధించు సూత్రములుగ అన్ని ధర్మములయందును పనిచేసినవను దానిని మనము గమనింపవచ్చును.

ధర్మగురునిష్ఠ

ఆదిప్రమథ, ధర్మగురు బసవణ్ణగారియందు నిష్ఠ వెరుగవలెను. “బసవణ్ణన నెనెదు మాడువ భక్తి నడెవుదయ్యా, బసవణ్ణన నెనెయదే, మాడువ భక్తి ఎళెతటవయ్యా” అని సిద్దరామేశ్వరులు చెప్పినట్లుగ, సమాజముయొక్క కేంద్ర శక్తిగా గురు బసవణ్ణగారు నిలువవలెను. ఒక ఉత్తమమైన బీజమును వేయుదుము. అది మొలకెత్తి సస్యమగును. అది పరిపూర్ణ వృక్షమగునంతవఱకు మనము అతి జాగరూకతతో చుట్టు మొలచిన పనికిరాని మొక్కలను తీసివేయుచు పోషింపవలెను. లేకున్న మూలవృక్షము చుట్టును అనావశ్యకములగు చెటుపుట్టి మనకు కావలసిన చెట్టుయొక్క శక్తిని తగ్గించివేయును. అట్లే లింగాయతధర్మపు ఇతిహాసమునందు మూల బసవ సంప్రదాయము చుట్టును. స్థానిక పంథ, ఉప పంథ (lococults) లను అనావశ్యక విషయములు పుట్టి నిజమైన పరంపరను చాలమట్టుకు శిథిలముచేసినవి. ధర్మగురువును మఱపించు పనిచేయుచున్నవి. ఈ ధర్మ - సమాజములందు గురు బసవణ్ణగారి స్ఠానమూ చాల వైశిష్థ్యపూర్ణముగనున్నది. అది మఱియెవరికి చెందవలసినదికాదు.

పన్నెండెవ శతమానమున హిందూ ధార్మిక క్షేత్రమునందు వచ్చిన బసవణ్ణగారు, లింగాయత ధర్మమను భవ్య భవనమును నిర్మించిరి. అది ధర్మమునకుండవలసిన పదకొండు లకణములనన్నింటిని లోగొన్న సుసజ్జిత పరిపూర్ణ ధర్మము. ఈ భవన రచనయగునప్పుడు అసంఖ్యాకులైన శరణులు బసవణ్ణగారి అంగాంగములవలె పనిచేసిరి. కాల కాలమునకు ఈ భవనము కొంచెము శిథిలమయినప్పుడు దానికి మరల వన్నెపూసి, సున్నము కొట్టి ఆయాకాలమునకు అనుగుణముగ బాగుగాకనబడునట్లు చేసిన వారు చాల మంచి మహానుభావులు, శ్రీ తోంటద సిద్ధలింగేశ్వరులు, షణ్ముఖ శివయోగులు, నూరారు మంది. విరక్తులు, మైలార బసవలింగ శరణులు ఈ విధమైన సుధారణను చేసిరి. అయితే శ్రేయస్పంతయు పోదగినది మూలమహా యోజనను, రూపురేఖను వేసియిచ్చిన ధర్మశిల్పి బసవణ్ణగారికి, లింగాయత ధర్మ సంస్థాపకులకు అగుచున్నది.

కొందరు విరక్తులు తమ మఠములు బసవణ్ణకంటెను పూర్వమనుండి వచ్చినవని చెప్పుదురు. ఇది “మా అప్పకంటెను మొదట నేనుంటిని” అని మూర్ఖుడైన ఒక కుమారుడు చెప్పినట్లు హాస్యాస్పదము. లింగాయత మఠములు బసవణ్ణగారి తరువాత వచ్చినవి. ఒక వేళ ఏవైన వెనుకటి మఠములుండిన అవి శైవ మఠములు. లాకుళీశ, పాశుపత, కాళాముఖ పరంపరకు చేరినవి. వాళందరు బసవణ్ణగారి తత్త్వ ప్రభావమునకు మార్పుచెంది లింగాయతధర్మమునే స్వీకరించిరి అనునది తెలిసికొనవలెను.

ఈనాడు బసుసంఖ్యాక మఠములవారు వేఱువేఱు సమయములను కల్పించుకొని పరస్పరబేధములు చేసికొని లింగాయత సమాజ భక్తులను విభజనచేయుచు “మీరు ఈ మఠమునకు నడచుకొనుడు” అను విధముగా భోధింతురు. ఆ భక్తులు కూడ “మేము ఈ మఠమునకు భక్తులము” “ఆ మఠమునకు భక్తులము" అని భిన్నభావపు మాటలాడుదురు. ఇదియంతయు వదలి “మేము శరణసమయమువారి (శివసమయ ప్రతిష్టాపనాచారి బసవణ్ణ), బసవభక్తులము, శరణ మార్గులము అనుభావము అలవడవలసివచ్చినది”.

పరమాత్మునియొద్దకు, ధర్మగురువునొద్దకు జనులను పిలుచుకొనివచ్చుట మఠాధికారులు కర్తవ్యమే కాని, తమ యొద్దకు, తమ మఠ - సింహాసనములుయొద్దకు కాదు, ఈ నాడు దృఢముగా మనము చెప్పవచ్చును, లింగాయత సమాజముయొక్క ఏకొందరుగాని ఎక్కువగా కాని గణ్యులు వోయనను ఏమియు కాదు, తత్త్వము సధృడమూగానున్న మరల అది చిగురును. అయితే సమాజము నిలిచి బసవతత్త్యము పోయిన అటి సమూజమునకు భవిష్యత్తు లేదు. మనవంటివారి పుట్టవచ్చును, పోవచ్చును. కాని ఇతిహాసమందు గురు బసవణ్ణవంటివారు పుట్టునది. ధర్మము కట్టునది ఒక సారియే. మన దేశమునందు కొన్ని సంవత్సరములవెనుక బౌద్ధసమాజముండలేదు, బుద్దుని తత్వములుండినవి. అయితే తత్త్వములు సధృఢముగా ఉండినందువలన అనేక శతకముల తరువాత బౌద్ధధర్మము తలయెత్తగలడయ్యెను. ఒక సమాజము ఇప్పుడున్న దానియందు తత్వబలము లేకున్నచో కొన్ని సంవత్సరములలో అది క్షీణించును. ఇది తెలిసికొనవలసిన సమయము వచ్చినది. లింగాయత ధర్మపు ప్రతి అనుయాయి “నేను ఈ మఠమువాడను, ఆ మఠమువాడను అనునది వదలి నేను బసవభక్తుడను, శరణ సేవకుడను” అనియనవలెను. ఎందుకనగా మనకొక ధర్మమునిచ్చినవారు, బ్రదుకనేర్చినవారి బసవణ్ణగారు. ఆ మహావ్యక్తి అవతరించియుండని యెడల మనమందజూ శూద్రలుగా మిగిలియుండవలసినవారేమొ !

ఈ విశాలమైన లింగాయత ధర్మపు ఇతిహాసమునందు వచ్చి పోయియుండిన, వచ్చిపోవునట్టివారందఱు కేవలము సాధనములు, బసవతత్త్యపు తీరునులాగుడకు వచ్చినవారే కాని, తామే ప్రకాశించుటకు వచ్చినవారు కారు.

బసవణ్ణగారు లింగాయత ధర్మమను కల్యాణరాజ్యముయొక్క ఫలమునిచ్చు బీజమొకదానిని నాటిరి. వృక్షము సొంపుగా పెరిగి సర్వాంగ పరిపూర్ణమైన సమాజమును ఇచ్చినది. తరువాత వచ్చిన మహాశివయొగులు, శరణులు ఆ వృక్షమునకు నీరు పోసి, ఎరువు వేసి, పోషించుచు వచ్చిరి. కాని దుర్దైవ మేననగా ఇటీవల కొన్ని దశకములనుండి అనేక దుష్ట తత్యములు, సంప్రదాయములు సమాజమునందు చేరుటయే కాక బసవ తత్వ వృక్షముయొక్క కొమ్ములను నరకుచు వచ్చినవి:

కాబట్టి ఒక మాటను మనము మరచి పోరాదు. బసవ తత్వ మహావృక్షమును విస్తారముగా పెరిగినకొలది మనకు యథేచ్ఛమైన తత్వపు నీడ, "ముక్తిఫలము దొరకును. దీనిని తెలియక బోదెచుట్టునూ, ముల్లుకంపలను వేరుగినిచ్చినచే రేపు మనకే కూర్చుండుటకు అసాధ్యమగును. లింగాయత ధర్మపు ప్రతి అనుయాయులు, స్వాములు, మఠాధికారులు, సాధకులు, సిద్ధులు “శ్రీ బసవణ్ణగారు మన ధర్మగురువు, వారి తత్వ ప్రచారమునకై మన బ్రతుకు ధారపోయబడినది" అను ఏకనిష్ఠను వెంచుకొనవలెను. అప్పుడు మాత్రమే స్థానిక ఉపపథములు (lococults) నిర్మాణము కాక సమాజము ఏకవాకముగా నిలుచును.

ఆత్మవిరహితమైన శరీరమును ఎట్లు చీమలు, పురుగులు మున్నగునని చుట్టుకొని, పీకి తినునో అట్లు బసవనిష్థ లోపించిపోయిన లింగాయత సమాజమును మూఢనమ్మిక, కందాచారము, జాతీయత, మున్నగునవి పీకి తినుచున్నవి.

కాబట్టి ఏకగురునిష్ఠను అనుయాయులు పెంచుట ఇప్పుడు అత్యగత్యముగనున్నది. "గురుబసవణ్ణగారు ఈ ధర్మమునకు ఆద్యులా లేక మొదటనే ఈ ధర్మముండినదా?” అను సందేహమునకు అవకాశమివ్వక సమతావాది, మంత్ర పురుషులైన బసవణ్ణగారే ఆదిగురువు, మోక్షదాయకుడు, శరణాగత రక్పకుడు, అను నమ్మిక, నిష్ఠ వెంచుకొనుట అత్యగత్యమగుచున్నది.

ధర్మగురు బసవణ్ణగారి భావచిత్ర పూజ

బసవణ్ణగారు లింగాయత ధర్మపు జీవము, కాన, లింగాయతుని ఇంటియందు ఏమి లేకున్ననూ బసవణ్ణగారి వచనముల ఒక గ్రంథము ఏత్తి కనబడునట్లు వేసిన భావచిత్రము వుండవలెను. ఇంటిలోనికి కాలువేటుచున్నంతనే ఎదురుగోడ మీద బసవణ్ణగారి సుందరమైన భావచిత్రముండవలెను. వ్యాపారస్తులు అంగడులయందు, వైద్యులు తమ వైయుక్తిక చికిత్సాలయములందు వేసికొనవలెను. ధర్మగురువు సాక్షిగా ప్రామాణిక వృత్తిని చేబట్టుచున్నామని ప్రతిజ్ఞ చేసి ప్రతిదినమూ భావచిత్రమును చూచినప్పుడంతయూ దానిని స్మరించుకొని సుప్రభాతమునందు పూజించి దర్శనము చేసుకొని వృత్తిని చేబట్టినచో వ్యక్తి అన్నివిధముల అభివృద్దిచెందుటయుందు ఏమాత్రమూ సంశయము లేదు. అట్లే ప్రతి లింగాయతుని ఇంటియందు అక్కమహాదేవియొక్క భావచిత్రమువుండవలెను. ఎందుకనగా అక్కమహాదేవియంతటి శరణురాలు, వీరవిగాగిణి, మహాశివయోగిణి, కవికోకిల, దార్శనికురాలు, ధార్మిక ఇతిహాసమునందు దొరకునది కష్టసాధ్యము. కన్నడనాడుయొక్క గర్వకారణముగా వీరిద్దరి ఫోటోలను వంచవలెను. ఇంటిలోకాలు వెట్టుచున్నంతనే ఈ భావచిత్రములు కనబడవలెను. ఇది ప్రతి అనుయాయియూ ధర్మగురువునకు చెల్లింపవలసిన అల్పమైనకానుక.

పూజాగృహమునందు ధర్మగురు బసవ భావచిత్రము.

బసవతత్యానుయాయి లింగాయతుని పూజాగృహము వందల (నూరారు) భావచిత్రముల ఒక సంతవలేకాక ప్రశాంత వాతావరణముతో కూడియుండవలెను. పూజకు కూర్చొను చొటికెదురుగా గురుబసవణ్ణగారి భావచిత్రముండవలెను. బసవగురు సన్నిధియందె ఇష్టలింగపూజ చేయవలెను. లింగపూజానంతరము బసవగురువుయొక్క 108 నామావళిలను పాడవలెను.

ఇష్టలింగధారణ కానటి బిడ్డలకు మాత్రము పూజకు అవకాశమే వుండనికారణముగ వారు పూజ, దర్శనము, ప్రార్థన చేసియే తీరవలెనను నియమము ఈ ధర్మమునందుడవలన వారికి బసవగురుపూజ తప్పని సరియగునట్లు చేయవలెను. స్నానముచేసి, మడిగట్టి, వచ్చిన బిడ్డలు విభూతిని ధరించి, బసవగురువుయొక్క భావచిత్రమునకు పూజచేసి 108 నామావళిని పఠించి తీర్థ ప్రసాదములను స్వీకరించి పోవలెను.

కాబటి అనుయాయులు వారివారి ఇండ్లయందు పూజామంటపములను కట్టి అచ్చట ప్రతి దినమూ బసవపూజ జరుగు ఏర్పాటు చెయవలెను. కూడల సంగమ సుకేత్రమందు కృష్ణా మలప్రభానదుల కూటమందుండు శ్రీ బసవేశ్వర ఐక్య మంటపమువంటి మంటపము కట్టి దానియందు శ్రీ బసవగురుమూర్తినిగాని భావచిత్రమునుగాని వుండుట సూక్తము.

బసవేశ్వర పూజావ్రతము

ఆదిశరణులు చెప్పునట్లుగా మన పూజలన్నింటియందును గురుబసవణ్ణగారిని తలంపవలెను. సత్యనారాయణ పూజ, నవగ్రహపూజ, వరదాశంకరవ్రతము, శనివ్రతము, గౌరీగణపతి వ్రతము, లలితాసహస్రనామము, మొదలగురవన్నియూ లింగవంత ధర్మానుయాయులకు నిష్ఫములు. కాబట్టి గురుబసవణ్ణగారిని పూజించునట్టి శ్రీ బసవేశ్వర పూజావ్రతమును చాలా సూక్తముగా రచించుటయైనది. ఈ పుస్తకమును తెప్పించుకొని ఇంటివారే చేయువచ్చును.

సుఖవొందు కోట బందల్లి బసవణ్ణన నేనెవుదు
దుఃఖవొందు కోటి బందల్లి బసవణ్ణన నేనెవుదు


అను మడివాళ మాచితందెగారి ఆదేశము మేరకు సుఖ-దుఃఖముల సమారంభములందెల్లెడల బసవేశ్వర పూజను చేయవలెను. రుద్రాభిషేకము మున్నగునది చేయరాదు.

ఏదైన ధార్మిక సభ సమారంభము నడచినచో ఆదిప్రమథ ప్రథమగురు బసవణ్ణగారి స్తోత్రము చేయవలెనే కాని గణపతి, సరస్వతిమున్నగు దేవతుల స్తోత్రము కాదు.

బసవణ్ణగారి ఉంగరము, కంఠపదకము

లింగాయతలు కంఠమునందు ఎవరెవరిదొ లాకెట్, నల్లదారము, తాయత్తు, వేలికి ఉంగరము వుంచుకొనక, బసవణ్ణగారి ఉంగరము, లాకెటు ధరింపవలెను. మూఢభక్తులై అన్యదేవతలను కంఠమునందు వేసికొనరాదు. బసవణ్ణగారే ఆది గురువుగా వచ్చిన సత్-సంప్రదాయ యొక్కదారిని విడిచి పోరాదు. ఇష్టలింగమును బసవగురువును తప్ప ఇంకేమియూ ధరింపరాదు.

ఇంటియందు సముదాయ ప్రార్థన

ప్రతిదినము తప్పక ఉదయమున లింగపూజానంతరము బసవగురువుయొక్క భావచిత్రమును పూజింపవలెను. సాయంకాలమున ఇంటివారందఱు బసవగురువుయొక్క భావచిత్రమునకు ఎదురుగా కూర్చుండి ప్రార్థన చేయవలెను.

మఠముల మేదుట బసవ స్మారకము

దేని యావశ్యకత మఠములందు ఎక్కువగా కలదు. లక్షలకొలది రూపాయలను ఖర్చు చేసి మఠముల యెదుట, మఠముల వైన గోపురగడియారములను నిర్మించు పద్ధతి మఠాధికారులయందు వచ్చినది. ఇప్పుడు ఎట్టి సామాన్యుల చేతియందును గడియారములుండగా గోపుర గడియారముల ఆవశ్యకత లేనేలేదు. అట్టివానిని స్థాపించు పురసభాసంఘ - సంస్థలు కావలసినన్నియున్నవి. క్రిశ్చియన్నుల చర్చిముందునకు వచ్చినప్పుడు ఎత్తి కనబడు శిలువ అందఱి కన్నులకు కనబడును, వారి ధార్మిక సంస్థలయెదుట విస్తారమైన బయలు ఉన్ననువారు అంగడులను కట్టి అద్దెకు ఇచ్చి ధార్మిక వాతావరణమును కలుషితము చేయరు. కాని అనేక లింగాయత మఠముల యెదుట అంగడులవరుసమే ఎక్కువై మఠమును గురుతు పట్టుటమే కష్టసాధ్యమగుచున్నవి. ఈ వ్యావహారిక మనోవృత్తి సరియైనదికాదు.

కాబట్టి మఠమున మందుభాగమున, వైన గోపుర గడియారమును నిర్మించుటకు బదులుగ, గురు బసవణ్ణగారి కంచు పంచలోహ ప్రతిమను చేయించి ఎత్తయిన స్థలమున స్మారకముగ నిలుపుట తగినది. కోంతమంది మతాధికారులు “అయ్యొ, బసవణ్ణగారి ప్రతిమను నిలిపినచో మనము జాతివాదులనము, సంకుచిత తత్వము గలవారలము, - అని అన్య సమాజమువారు తెలిసికొనవచ్చును” అని భయ పడుదురు. బసవణ్ణగారు జనాంగమంతటికి సొత్తు, అందరి ఉద్దారమునకై శ్రమించినవారు. వారి కల్యాణమునకే బసవణ్ణగారు శ్రమించినప్పుడు వారు ఆ జనాంగమువారు కారా? దీని తెలుపునట్టి ధైర్యము, ఆత్మవిశ్వాసము వీరియందు పుట్టవలెను. ఒక వేళ వారు అట్లే అనిరి అని పెట్టుకొందము, అందురుగాక, ఈ మతాధికారులుండునది లింగాయత ధర్మ ప్రసారమునకు కాదా, అయ్యొ, ఇతడు ఆవులను మాత్రమే కొనుచున్నాడు, గొర్రెలను కొనుట లేదు అని ఎవరో ఆక్షేపించుచున్నారని తన ఆవులను చూచుకొను బాధ్యతను విడిచి పశువుల కాపరియొకడు గొర్రెలమందయొద్దకు పోయినచో అతని కర్తవ్యమునకు చ్యుతి వచ్చునదే కాక ఆవులను పులులు కబళించు సాధ్యత కలుగును. లింగాయత ధర్మ మఠాధుకారులై ఆ ధర్మ ప్రసారమునకై పీఠయమునెక్కి దానిని ప్రచారము చేయుటకు వెనుకంజ వేయుటను ఏమనవలెనో తెలియకున్నది. ఇది సరియైన పద్దతి కాదు. ఇతరులు పంట భూములు మిద ఆక్రమణ చేయరాదు, నిజము. అయితే తన పంట భూములుమీదకు వచ్చినప్పుడు కూడ పశువులను అడ్డుకొనరాదా? తన గొర్రెలను బాగుగా రక్షించువాడు ప్రామాణికుడైన కురుబ జాతివాడు. అట్లే తనను నమ్మిన అనుయాయులను బాగుగ, వైచారికముగ ముందుకు నడపు ధీరులు మాత్రమే నిజమైన గురువులు.

దీనిని తెలిసికొని వేయారు మంది, లక్షావధి జనులు వచ్చిపోవు మఠములవంటి స్థానములందు బసవణ్ణగారి భావచిత్రములు, కంచు ప్రతిమలు ఎత్తికనబడునట్లు నిలుపవలెను. లేకున్న అది ధర్మ ద్రోహము, గురుద్రోహము అగుచున్నది.

లింగాయత ధర్మ సంస్థల చిహ్నము

చర్చిని చూడడగనే అది క్రైస్తవ సంస్థయని, మసీదును చూడగనే అది ముస్లిం సంస్థయని వెంటనే తోలును. ఆదే రీతిగా లింగాయత ధర్మ సంస్థలను గుర్తించుటకు మంటప, మఠ, గుడి, ఉన్నతాసనముల ఎదుట ఐక్యమంటపముయొక్క ప్రతికృతి నిలిపి వైన షట్-కోణ లాంఛనము వేయుట సూక్తము. ఎగురవేయు ధ్వజము కేవలము కావిబట్ట కాకుండ దానియందు షటోకోణ లాంఛనము మరియు ఇష్టలింగము వుండుట సూక్తము.

బసవ జయంతి - లింగైక్య దినాచరణము

లింగాయత ధర్మపురుషుని హృదయ స్వరూపులైన బసవణ్ణగారి జయంతి లింగాయతులందరికి సర్వ శ్రేష్ఠమైన పండుగ. అది మనుకులమునకు స్వాతంత్ర్యము కలిగించు మహాపురుషునకు జన్మమిచ్చినది. ప్రతి సంవత్సరమూ వైశాఖ శుద్ద అక్షయ తృతీయయందు ఈ పండుగ వచ్చును. ఆనాడు లింగాయుతలందరూ ఇంటియుందు తప్పనిసరిగా , స్నానపూజాదులను చేసి, వచనశాస్త్ర పారాయణము చేయవలెను. స్తితిమంతులు, వ్యాపారస్తులు, అనుకాలమున్నవారు తమతమ యొగ్యతానుసారముగ వచనముల వందల (నూరారు) ప్రతులను ప్రకటించి లోకగుని పంచవలెను. స్త్రీలు తమ స్నేహితురాంటును ఇంటికి ఆహ్వానించి టెంకాయ, అరటిపండ్లు ఇత్యాది వస్తువులను ఇచ్చుటకు బదులుగా చిన్న వచన పుస్తకం (పత్రం) పంచవలెను. వ్యాపారస్తులు తమ అంగడులయందు బసవణ్ణగారి పెద్ద భావచిత్రమును అలంకరించిపెట్టి పూజించి సహోద్యోగులను ఆహ్వానించి వచనగ్రంథములను పంచవలెను. ఆనాడు అంగడి వ్యాపారమును నిలిపి దీనదరిద్రులకు చేతనైనంత సహాయము చేసి, వైద్యులు ఆనాడు ఉచిత చికిత్సను ఇచ్చి సేవాభావమును ప్రకటింపవలెను. పెద్ద ప్రమాణమునందు బసవజయంతియొక్క ఉత్సవములను ఏర్పాడు. చేసి దానియందు భాగమువహింపవలెను. నేను శ్రీమంతుడను, పెద్ద అధికారిని, విద్యావంతుడను అను గర్వము తెచ్చుకొనక కింకరుడై భాగము వహించి గురుభక్తిని, సమాజ సంఘటనా ప్రజ్ఞను ప్రకటింపవలెను. మనకై ఒక ఘనమైన ధర్మమునిచ్చి మనుకులముయొక్క సర్వవిధ స్వాతంత్రమునకు పోరాడిన బసవణ్ణకు ఇంతటి కృతజ్ఞతను చూపక పోయినచో మనము కృతజ్ఞత లేనివాళ్ళు అని చెప్పవచ్చును. ముఖ్యమైన కొన్ని జయంతులనగా యుగాది రొజు వచ్చు అల్లమ ప్రభుదేవర జయంతి, చైత్రమాసపు దవనద పున్నమనాడువచ్చు హరళయ్య మధువరసర మరణవే మహానవమి పండుగ, దీపావళి పాడ్యమినాడు వచ్చు చెన్నబసవ జయంతి, శివరాత్రిని సర్వశరణుల దినాచరణమగా ఆచరింపవలెను. బసవజయంతిని మాత్రము వైశిష్యపూర్ణముగా సార్వత్రికముగ ఆచరింపవలెను. అనుకూలమున్నచో అదే పద్ధతిని అన్ని జయంతులయందునూ అనుసరింపవచ్చును. లేకున్న ఆయా శరణుల వచనములను ఆనాడు పటించి పండుగ భోజనము చేసి ముగింపవచ్చును. ఇప్పుడు కొన్ని పండుగలను రాక్షుసుల వేరిటనో దేవతుల వేరిటనో ఆచరించుచున్నారు గదా. వానిని శరణుల జయంతులనగా మార్పు చేసినచో దానికి ఘనమైన అర్థవ్యాప్తి దొరకును.

బసవ లింగైక్య దినాచరణము

విశ్వగురు, మంత్రపురుష, మహానుభావి, ముక్తిదాయక, బసవణ్ణగారు లింగైక్యము చెందినది. శ్రావణ శుద్ధ పంచమినాడు. కూడలసంగమ గురుకులమునందు ఇష్టలింగ పూజామగ్నులైన బసవణ్ణగారి “తావు బంద మణిహ పూరయిసిత్తు శివనట్టిద బెసను సందిత్తు” అని తెలిసి ఇహలోక వ్యవహారమునకు మంగళము పాడదలచిరి. ప్రాణలింగి స్థితిని పొంది కాయజీవము కుట్టును విచ్చుకొని పరమహంసులైన ఆ బసవణ్ణగారు దేహమును విసర్జించి తమ పరిశుద్దాత్మను పరమాత్మయందు విలీనము చేసి కరగిన కర్పూరమైరి. సముద్రమునందు చేరిన నదినంటవార్తెరి.

బసవజయంతిని ఉత్సవ ప్రధానమూగ ఆచరించిన బసవ పంచమిని వ్రత ప్రధానముగ అచిరింపవలెను. శ్రావణ మాసపు అమావాస్య మరుదినమునుండి బసవేశ్వర పూజా వ్రతమును ఆరంభింపవలెను. పంచమినాటికి ఐదవ వ్రతము ముగియును. పంచమినాడు పూజామంగళమును చేసి ప్రసాద వితరణము చేయవలెను.

సామూహికముగ చెయవలసిన ఐదుదినములు వ్రతము చేసి బసవ పంచమినాడు అందరూచేరి సామూహికముగ ప్రసాద దాసోహమును చేయవచ్చును.

గణమేళ

కాకి ఒక్క మెలుకు చూచిన
కూసి పిలువదే తనబలగమునంత
కోడి ఒక్కనూక చూసినా
కూసి పిలువదే తనకులమునంత
శివభక్తులవుచు - భక్తిపక్షమానకున్నచో
ఆ కాక కోడికన్న అధముడయ్యా
కూడలసంగమ దేవా

అనే ధర్మగురువుని ఆదేశమువలె భక్తులైనవారందరు - కలసి బ్రదుకడం నేర్చుకోవలసినది.

వారానికి ఒక సారియైనా అందరూ కలసి ప్రార్ధనము చేయవలసినది. సంవత్సరానికి ఒక సారియైనా ధర్మక్షేత్రము కూడలసంగమ రావలిసినది. అదే ప్రకారముగా సంవత్సరానికి ఒక సారియైనా స్థళీయమైన శరణబంధువులందరూ సమావేశమై సముదాయ ప్రార్థనము చేసేది చాలా అవశ్యమైనది.

ఊరులోని ఒక విశాలమైన మైదానములో అందరూ శివరాత్రియందు ప్రొద్దున 10 గంటలనుండి 11.30 గంటలవరకు సముదాయ ప్రార్థనము చేసి సర్వశరణుల దినాచరణమును ఆచరించి ప్రసాద వితరణము చేయవలెను. అందరూ ప్రసాదమును స్వీకరించి ప్రతియొక్క లింగాయత ధర్మానుయాయులు తప్పకుండా శివరాత్రియందున నడిచే గణమేళములో భాగవహించాలి. ఈ కర్తవ్యములో చ్యుతి లోప-దోషములు రాకూడదని సంకల్పించాలి. 1) రాష్ట్రీయ బసవదళ రచన: తమతమ గ్రామములందు రాష్ట్రీయ బసవదళములను కట్టవలెను. విశ్వగురు బసవణ్ణగారి ఐక్యక్షేత్రము, లింగాయత ధర్మక్షేత్రము. కూడలసంగమమందు బసవధర్మపీఠము స్థాపనగొనియుండి ఇది శాసకాంగముగ బసవధర్మ సంపత్తును కార్యాంగముగ రాష్ట్రీయ బసవదళమును పొందియున్నది. కాబట్టి ఈ రాష్ట్రీయ. బసవదళ కేంద్ర సంస్థకు రాష్ట్రీయ బసవదళములవారు వేరు దాఖలుచేసి దానివలన మార్గదర్శనమును పడయవలెను.

2) వారమునకొక దినమును గుర్తించుకొని ఆనాడు సామూహిక ప్రార్థన నడుపవలెను.

3) బసవధర్మ సంసత్తు ఘోషించు శరణజయంతి, లింగైక్యదినాచరణను ఆచరింపవలెను.

4) ప్రతిసంవత్సరమూ ధర్మక్షేత్ర కూడలసంగమముయొక్క శరణమేళమందు భాగియగుట తనకర్తవ్యమనుభావనను ధర్మానుయాయియందు పుట్టించుటయే కాక ధర్మక్షేత్రముయొక్క వేరుగుదలకై, శరణమేళ నిర్వహణకై, ధనధాన్యరూపమైన కానుకలను చెల్లింపవలెను.

5) తమ సమీపమందలి గ్రామముందుండు జనులకు ప్రేరణ ఇచ్చి రాష్ట్రీయ బసవదళమును కట్టవలెను.

6) రాష్ట్రీయ బసవదళ కేంద్ర సంస్థయు బసవాది శరణుల సాహిత్యము, ఇతిహాసము, బ్రతుకు, ఇత్యాదులకు అగౌరవము కల్గించు వ్రాతలు, మాటలు మున్నగువాటిని ప్రతిభటంటచుటకు గణాచార తండమును నిర్మించి దానికి సదస్యులగువారు కేంద్ర సంస్థకు వ్రాయవలెను.

7) భృత్యాచారగణము అను నేవాప్రధాన సంఘటన ఏర్పాటైయుండ ఈ గణముయొక్క సదస్యులకు సంవత్సరమునకు రెండు సార్లు శెలవుకాలమున సేవాకార్య నిర్వహణయొక్క శిక్షణ ఇవ్వబడును. ఈ విధముగా ,శిక్షణ పొందినవారు సమయము వచ్చినప్పుడు నేవచేయుటకు అనుకూలమగును.

కల్యాణ రాజ్య స్థాపన

మర్త్యలోకమన్నది కర్తారుని కమ్మటమయ్యా
ఇట చెల్లెడివారటనూ చెల్లెదరయ్యా;
ఇట చెల్లనివాలటనూ చెల్లరూ గదయ్యా,
కూడలసంగమదేవా (155)

అను తత్వమునెరింగి ఈ మర్త్యమును దైవీమయముగ చేయ యత్నింపవలెను. ఆత్మకల్యాణము, సమాజ కల్యాణము, రాష్ట్ర కల్యాణము, విశ్వ కల్యాణము - వీనిని గురిగా పెట్టుకొని బ్రతికి ఈ మర్త్యమునందే కల్యాణరాజ్య స్థాపన (Kingdom of God) కావలెనని సదాశ్రమించి దైవానుగ్రహమునకు పాత్రుడగు విశ్వ నాగరికుడే లింగాయతుడు. ఈ తత్వముయొక్క బునాదిపై అన్ని జాతిమత ధర్మముల జిజ్ఞాసులను ఆకర్షించుకొని వైశాల్యత పొంది సకలజీవాత్ముల శ్రేయస్సును కొరు ధ్యేయము కలవాడే ఆదర్శ లింగాయతుడు.

వచన సాహిత్య పోషణ - ప్రచారము

జగత్తునందే అత్యమూల్యముగనుండు వచన సాహిత్యము లింగాయత ధర్మపు సంవిధానము. వర్ణ వర్మ, జాత్యతీత ధర్మ సహితమైన కల్యాణ రాజ్యమును కట్టు సూత్ర ప్రణాళిక ఇదియని తెలిసి బసవాది ప్రమథులు దీనినిచ్చిరి. ఇది ఇవ్వగల క్రాంతికారి పరిణామమునుగూర్చి శరణులు తెలిసికొన్నట్లుగా, జాతివాదులు కూడ తెలిసికొనియుండిరి. అందువలన దానిని నాశముచేయుటకు పూనుకొనిరి. తమ సాధనయొక్క రసఘట్టియైన వచనసాహిత్యమును నిలుపుటకు శరణులు పూనుకొనిరి. వీరమాతా అక్క_నాగలాంబిక, వీర శరణ మడివాళ మాచీదేవ, చిన్మయజ్ఞాని చన్నబసవణ్ణ - వీరు ముందుపడుటవలన వచన సాహిత్యమును రక్షించి, సహ్యాద్రి కొండల ప్రాంతమున దాచిపెట్టిరి. జాతివాదులు చాలినంతసాహిత్యమును నాశము చేసియూ ఉండవచ్చును. ఇంతయైనను మిగిలియున్న వచనసాహిత్య గాత్రము, సత్వము - ఈ రెండును అగాధమూగానున్నవి. అదే లింగాయత ధర్మ సంవిదానము, అందువలన లింగవంతలు మాత్రమే యేల? సమతావాది సమాజ దైవీరాజ్యము రావలెనను వారందురు దీని అధ్యయనము, పారాయణము చేయవలెను. లింగవంతలకు ఇది ధర్మసంహితకాగా, ఇతరులకు ఇది నీతి సంహిత కాగలదు.

1) కాబట్టి వచన సాహిత్యముయొక్క అధ్యయనము, పారాయణము, పఠనము చేయవలెను.

2) వివాహము, గృహప్రవేశము మున్నగు సమారంభములందు చదివింపులు ఇచ్చునప్పుడు సాధ్యమైనన్ని పుస్తకములు, శరణుల ఫోటోలను ఇవ్వవలెను.

3) తమ యిండ్లయందు వివాహము, శరణగణారాధన మున్నగు సమారంభములు జరిగినప్పుడు వచ్చిన జనులకు టెంకాయలు, పండ్లు స్టీల్ తట్టలు, ఇట్టివి ఇచ్చుటకు యథేచ్చగా ధనవ్యయముచేయక, అదే వెలగల వచనగ్రంధములను ఫల తాంబూలముగ ఇవ్వవలెను.

4) వరమహాలక్ష్మి, మంగళగౌరీ వ్రతములు మున్నగు వానికి ఎక్కువగా ధనము ఖర్చుచేసి లౌకిక వస్తువుల వాయనము ఇచ్చుటకంటే శ్రీ బసవేశ్వర పూజావ్రతము చేసి, వచనసాహిత్య వాయనము ఇచ్చుట అత్యంత అభినందనార్హము.

ఇట్లు ఆది శరణులు ప్రాణమిచ్చి రక్షించిన వచనసాహిత్యమును మనము అభిమానముతో ధనమిచ్చి ప్రచారము చేయవలెను. అది మన కర్తవ్యము.

ధర్మ ప్రసారలోలుపత

ధర్మప్రసారము అతి పవిత్రమైన కార్యము. మంచి నడత, మాటలతో కూడి ధర్మవంతుడైన చాలదు. తాను బ్రదుకు సత్యశుద్ద విధానమును ఇంకొకరికి నేర్పవలెను. ఆ ప్రసారకార్యము చేయవలెనన్న కాని బట్టలను ధరింపవలెనను నిర్బంధము లేదు. ప్రతియొక అధికారి, నౌకరు, విద్యార్థి వ్యాపారస్తుడు, గృహిణి. దాని సత్వమును, మహత్యమును సహోద్యోగులకు తెలియచేయుచు, తన చేతనైనంత ప్రచారము చేయవచ్చును. ధర్మప్రసారమునకు తన బిడ్డలను స్వేచ్చగా వినియొగింపవలెను. మనకై ఒక ధర్మమును ఇచ్చి మనకొరకు కప్పనిష్ఠురములను సంప్రదాయవాదులనుండి నిందను పొంది పడినవారిని, దూరీకరింపబడినవారిని, చేర్చుకొనబడనివారినిగూర్చి శ్రమించిన మాతృహృదయముగల బసవణ్ణగారికొరకు మన బిడ్డలను అర్పించి ధర్మ ప్రసారము చేసి కృతజ్ఞత చెల్లించకూడదా? కడుపునందుబుట్టిన ఒక బిడ్డయైననూ బసవధర్మ ప్రసార క్షేత్రమునకు పోనియని తల్లి-తండ్రులు కోరవలెను. ఆ దిక్కునందు వారినో తయారు చేయవలెను.

తనయొద్ద ఒక ఫలమున్నచో పంచుకొని తినుట సద్గుణము, ఔదార్యము అట్లే తనయందు ఒక ఘనతత్వమున్నచో లేనివారితో పంచుకొని, స్వీకరించి ఆనందింపవలెను. తన ధర్మతత్వములను ఆచరించి చెప్పి దాని మహాత్వమును ఇతరులందరికీ తెలిపివారిని కూడ బసవముయొక్క శుద్దసంసారమునకు పిలుచుకొని వారి జీవనమును సదాచారమునకు తీసికొనిపోవు ధర్మపచారముయొక్క ఆసక్తి (Missionary Zeal) ప్రతి లింగాయతునకూ వుండవలెను.

ఇతడేవరని ఇతడెవరని ఇతడెవరని నన్ననిపించకయ్యా
మనవాడని మనవాడని మనవాడని నన్ననిపించుమయ్యా
కూడలసంగమదేవా మి ఇంటి కొడుకని పించనయ్యా

అనునట్లు అందరిని ఆదరించి ధర్మమందిరములోనికే ఆహ్వానింపవలెను. సంకుచిత బుద్ధితో బయటకి త్రోయుటకూడదు. విశాలబుద్ధితో అందరిని ప్రేమింపవలెను. శెలవుకాలమునందు తీరికయున్నవేళయందు జనులు తమ తమ పల్లెలందు ధర్మప్రచారమునకు నిరతులు, కావలెను. అన్ని గ్రామలయందు ప్రార్థనలు నడుపుటకు జనులకు ప్రేరణ ఇవ్వవలెను. రాష్ట్రీయ బసవదళములను చేసి జనులకు ఉత్తమ నైతిక, ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చుటకు ఉత్సాహమునింపవలెను.

లింగదీక్షను పొందినవారియందు బంధుత్వభావనను అలింగులయందు స్నేహభావనను చూపి తన ఇరుగుపొరుగు వారిని కేవలము తనవలెనేకాక దేవాంశకలవారని తెలిసివారితో హితభావనమున నడచుకొని విశ్వబంధుత్వమును లింగాయతుడు అలవాటు చేసికొనవలెను. పాపులను, దుఃఖితులను తిరస్కారపు భావనతో చూడక మానవీయ కరుణతో చూచి వారికి ఉత్తమ భవిష్యత్తుయొక్క సాధ్యతవున్నదియని ప్రేరణ ఇచ్చి దైవీమార్గమునకు చేర్చవలెను.

ఎట్టి పాపమునే ముందు చేసియుండనము పశ్చాత్తాప పడి ముందు అట్లు చేయకుండునట్లు తెలివి తెచ్చుకొని పరమాత్ముని పాదములకు శరణాగతుడు కావలెను. అప్పుడు ఆ పాపమంతయూ పోయి పునర్జన్మ వచ్చును. అను బసవవాణి మేరకు లింగాయతుడు అన్యులకు బోధచేయవలెను. లింగాయతులకు లింగాయతేతరులకు - ఉభయులకూ బసవతత్వము ఎంద అగత్యమనునది మనస్సుకు వచ్చునట్లు శ్రమింపవలెను.

సంస్కృతి రక్షణ

లింగాయత ధర్మము 'ఒక స్వతంత్ర ధర్మమై’ తనదే అయిన ఒక సంస్కృతి కలది. తిండి తీర్థములందు, ఆటపాటలయందు, నడతమాటలయందు అన్ని చోట్ల వైశిష్ట్యమున్నది. ఈ సాంస్కృతిక ఆచరణలు, వైజ్ఞానికముగ సులభముగానున్ననూ ఆధునికతా దృష్టితో లింగవంతులు వీనినన్నింటిని విడుచుటకు సిద్ధపడినారు.

సంస్కృతిని నిలుపుకొనుటకై ప్రయత్నించుట ప్రతి అనుయాయి కర్తవ్యము. పాశ్చిమాత్య సంస్కృతి, విదేశీయ సంస్కృతుల పరిణామముగా ఎంతో మంది లింగాయతులు సంస్కృతిని గాలికి వదలి వెట్టుచున్నారు. పెద్ద పెద్ద అధికారులు, విద్యావంతులు వీరే ఈ సంస్కృతి పతనమునకు ముఖ్య కారకులు. తమ జవాబ్దారిని తెలిసికొని ఇంటియందు పునరుత్థానమునకు ప్రయత్నింపవలెను. ఇండ్లకు, బిడ్డలకు, శరణుల వేర్లు వెట్టుటలతోపాటు వారి కథలను తెలుపుచుండవలెను. ధర్మమును మనము రక్షించినప్పుడు అది మనలను రక్షించును.

ఎవరైననూ ఇంటికి వచ్చినప్పుడు “శరణు - రండి” అని స్వాగతమోయవలెను. పంపునప్పుడు “శరణు శరణార్థి పోయిరండి” అని నమస్కరింపవలెను. సంతోషముతో పంపునపుడు “జై జై” అని చేయి ఆడించవలెను. కాని “టాటా, బైబై” అని చెప్పరాదు.

సత్ - సంప్రదాయ నిష్ఠ

బసవణ్ణగారి ఉద్ఘోషణయేమనగా “తన తెలివియే తన గురువు” అనునది. స్వతంత్ర విచార శక్తి స్వాత్మావలోకన శక్తి - వీనికంటే పెద్ద సంపద ఏదియు లేదు. జగత్తులోని అన్ని తత్వములను స్వానుభవమను సానరాతికి రుద్దిచుండవలెను. ఏ ధర్మమైనను కాని, కాలానంతరముగ కొంత శిథిలమైనప్పుడు మూఢ నమ్మకములు, శుష్కాచారములు మితిమీరును. అప్పుడు ప్రవహించు నదియందు నిలిచిన నీళ్లు ప్రవహించునీరు అను రెండు భాగములున్నట్లుగ, ధర్మమందు జీవంతమైన సంప్రదాయము, సత్-సంప్రదాయము అను రెండు భాగములు మిగులును. అట్టి ప్రసంగమునందు మనుష్యుడు సంప్రదాయమునందు హితకరమైనదానిని మాత్రము నిలుపుకొనవలెను. దుష్ట సంప్రదాయమును విడిచి, సత్ - సంప్రదాయమును గ్రహింపవలెను. సత్ సంప్రదాయము, వికృత సంప్రదాయము, విరుద్ధ సంప్రదాయము, శిథిలసంప్రదాయము - అని నాలుగు విధములుగ దీనిని విభజింపవచ్చును. జంగముని అతిమానవ వ్యక్తిత్వము కలవానిని గౌరవించుము అను అర్థపూర్ణధర్మవాక్యము, నిజతత్వము శిథిలమైనప్పుడు అర్హత ఉన్నవారిని విడిచిపెట్టి జాతియొక్క బునాదిపై అయ్యగారిని పూజించు వికృత - సంప్రదాయమగుచున్నది. జీవోహంభావమును జ్ఞానాగ్నియందు వ్రేల్చు తత్వము శిథిలమై దీనములైన మేకలను - గుఱ్ఱములను అగ్నికి ఆహుతిచేయు వికృత సంప్రదాయమగుచున్నది.

లింగాయత ధర్మమునకు విరుద్ధమైన మూర్తిపూజ, సావరపూజ, జాతీయతలను ఆచరించుట విరుద్ధ సంప్రదాయము.

శరణ సంస్కృతి, సదాచారములను విడిచి శరణుల వేర్లను బిడ్డలకు పెట్టక ఆధునికమైన పిచ్చి అసంస్కృతికి బలియగుట శిథిల సంప్రదాయము.

వీనినన్నింటిని తొలగించుకొని, శరణులు చెప్పిన తత్వములను తూచా తప్పక ఆచరించునదే సత్సంప్రదాయము. దాని బలముచేతకనే సమాజధర్మములు సుధృడములగునని లింగాయతుడు తెలియవలెను.

శరణ పరంపరయొక్క పునరుజ్జీవనము

లింగాయతధర్మమునకు గురుబసవణ్ణగారే ఆది ప్రమథులై ఆనాటినుండి ఈ నాటివరకు సాగివచ్చిన శరణ పరంపరయున్నది. ఈ పరంపర తనమేటిగూటముగా బసవగురువునే ఉంచుకొని సాగివచ్చినదైనను, కొన్ని దశకములనుండి ఇటీవల మేటిగూటమును కదలించు ధూర్తయుక్తి నడచుచున్నది. బసవణ్ణగారే ధర్మగురువు - వచన శాస్త్రమే ధర్మసంహిత అను నమ్మకముమీద సాగి వచ్చియుండిన లింగాయత ధర్మచైనును కమ్ములనుండి తప్పును చేసియున్నారు. ఇప్పుడు సమాజము మేల్కోని, కమ్ములమీద మరల కూర్చొనునట్లు వాతావరణము నిర్మాణమగుచుండుట శుభ సూచనయుగ చున్నది. అత్యంత త్వరిత రీతియందు ఇప్పుడు జాగృతులై కార్యకర్తలైన శరణ బంధువులు సమాజ సంఘటన, ధర్మసంస్కారముల విషయమున గమనమివ్వవలెను.

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన - పూజ్య శ్రీ జగదురు మాతే మహాదేవి, కూడలసంగమము అనువాదము - విశ్వలింగాయత్ పరిషద్ (రి) సౌజన్యముతో
ప్రకాశకులు : బసవధర్మపు మహా జగద్గురు పీఠము, మహామనే మహామఠ, కూడల సంగమము,
హునగుంద తాలూకు, బిజాపుర జిల్లా - 587115

సూచిక (index)
Previousభృత్యాచారము (సమాజ సేవ Social Service)లింగాయతుడు ఎవరు?Next
*