Previous లింగాయతుడు ఎవరు? లింగాయత ధర్మపు పోరాటం Next

లింగాయతలు "లింగవంత"లు

*

ధర్మగురు బసవణ్ణగారి వచనాలు

217.
తండ్రి పిల్లలకు బుద్ది చెప్పేటప్పుడు
తప్పుకు కోపిస్తాడుగానీ ప్రాణం పైగాదు
లింగవంతుడు లింగవంతులకు బుద్ది చెప్పేటప్పుడు
అవగుణానికి కోపిస్తాడుగానీ లాంఛనానికి కాదు
లింగభక్తుడు లింగపథం తెలిపినప్పుడు
మచ్చరించే వారిని మెచ్చడు కూడల సంగమదేవుడు.

346.
లింగవశంగా వచ్చిన నడతలు
లింగవశంగా వచ్చిన నుడువులు
లింగవంతులు తాము బెదరనెందుకు
లింగముంచి నట్టుండాలి గాక
కూడల సంగమదేవుని భక్తుల అభిమానం తనదంటాడు కనుక.

347.
లింగమున్నచోట నింద ఉండదు, నింద వున్నచోట లింగముండదు
వారెలా వుంటేనేమి? ఎట్లుంటేనేమి? లింగవంతులు వారు
ఉపమించరాని మహాఘనము - కూడల సంగుని శరణులు.

అల్లమప్రభుదేవరు

602.
లింగవంతునికి లింగ సంబంధ వార్తలు పలుకడమే తప్పు
ఆర్బాటం చూడు ఆర్భాటపు సందడి చూడరా !
బిందెడు పాలను విరిగేలా చేసి
ఇంకా ఒదిగివున్నానంటే తగునా? గుహేశ్వరా.

శరణ వచనాలు

821.
నిందాస్తుతులు చేసే దుర్వ్యసనపరులను
దురాచారాలతో వర్తించే వారిని
భక్తులు, లింగవంతులు, ఏనాడూ
అంగీకరించరు కనవయ్యా
దూషణే పాతకమన్నారు కాబట్టి
భక్తుల నిందించి పాతకాని కొడిగట్టే
మలినుల ముఖం చూడరాదు -
కూడల చెన్న సంగమదేవా.

1073.
లింగమంతులు తామైన పిదప
అంగనలను చేతలుమాటల కోసారి
లింగ రాణులని భావించాలి
లింగవంతులు తామైన పిదప
అనుభావపు వచనాలు పాడి
సుఖ దుఃఖాలకభేద్యులై ఉండాలి
లింగవంతులు తామైన పిదప
జంగమ పూజచేసి సదా లింగైక్యులై వుండాలి కనుమా
కపిల సిద్ధ మల్లికార్జునా.

1572.
బహిరంగంగా శివలింగము, అంతరంగంలో అన్యదైవం
బహిరంగంగా లింగ క్రియ, అంతరంగంలో అన్యదైవం
బహిరంగంగా భక్తులు, అంతరంగంలో భవులు
ఇటువంటి వాళ్లను భక్తులనవచ్చా? అనకూడదు
మిమ్మల్ని పూజిస్తే భక్తులవుతారా? సదాచారానికి సరిపోరు
లింగవంతులు మెచ్చరు
ఈ ఉభయ సంకీర్ణాన్ని నీవే ఎరుగుదువు
నా మనసులో వుండి నాకేది మంచిదో
విచారించి కరుణించవయ్యా
ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా!

1581.
లింగాన్ని తెలుసుకున్న లింగవంతుడు సర్వాంగ లింగమూర్తి
అతని మాటే వేదం
ఆతని నడతే శాస్త్ర పురాణ ఆగమ చరిత్రలు
ఆ మహామహుని మాటలతో తర్కించకూడదు
నడతలో నాస్తికత వెదికితే నరకం తప్పదయ్యా
లింగణ్ణి తెలుసుకున్న మహా మహునికి నమో నమో అంటాను
ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా!

1885,
ఆ మహాలింగవంతు డొకడే తిన్నాడన వద్దు
అతని దంతాలన్నీ పంకికారులు
అతని నడుమన ఉండే కాంతిరూపము నీవు కనుమా?
కలిదేవయ్యా !

References

[1] Vachanas selected from the book "VACHANA" (Edited in Kannada Dr. M. M. Kalaburgi), Telugu Version Translation by: G. Chandrasekhara Reddy. ISBN: 978-93-81457-05-4, 2012, Pub: Basava Samithi, Basava Bhavana Benguluru 560001.

*
Previous లింగాయతుడు ఎవరు? లింగాయత ధర్మపు పోరాటం Next