|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమ: ||

తోంటద సిధ్ధలింగ శివయోగి గారి బసవ స్తుతి వచనము

✍ మడపతి.వి.వి.
లింగాయత సమన్వయ సమితి
హైదరాబాద్ తెలంగాణ.

కాయకానికాధారము భక్తుడు.
లింగానికాధారము భక్తుడు.
జంగమానికాధారము భక్తుడు.
ప్రసాదానికాధారము భక్తుడు.
శక్తికాధారము భక్తుడు.
భక్తికాధారము భక్తుడు.
నాకాధారము భక్తుడు.
నీకాధారము భక్తుడు.
నేనూ నీవనే భేదము లేనివాడే భక్తుడు.
ఇటువంటి భక్తుడు సంగన బసవణ్ణని శ్రీపాద పద్మముయందు
భ్రమితుడై వుంచుమయ్యా, మహాలింగగుర శివసిధ్ధేశ్వర ప్రభువా.!" - వచన సంపుటం: 11, వచన సంఖ్య: 508.

పై వచనము తోంటద సిధ్ధలింగ శివయోగి గారు భక్త స్ధల మూలమును వివరిస్తూ,
బసవేశ్వరుని గురించి స్తుతించడం జరిగింది.

లింగాయత ధర్మములోని షట్ స్థలములలో ముఖ్యమైనది ప్రముఖమైనది మొట్టమొదటి స్థలమే భక్తస్థలము. భక్తస్తలములో ఒక భక్తుడు ఏవిధంగా వుండాలి ఆయన లక్షణాలను గురించి తోంటద సిధ్ధలింగ శివయోగి గారు చాలా చక్కగా వివరించడం జరిగింది.

భక్తుడు తన జీవితాన్ని కొనసాగించడానికి సత్య శుద్ధమైన కాయకము, మనము చేసే ఏ పనిలో అయినా సత్యమై పరిశుధ్ధమై వుండాలి. లింగాయత ధర్మ సిద్ధాంతమే కాయక సిధ్ధాంతాన్ని తెలుపుతుంది. లింగాయత ధర్మములో ఇష్టలింగాన్ని తత్వనిష్టతో ప్రతీరోజు లింగాంగ సాధనం చేసి ఏకదేవోపాసన కలిగి *శరణుడు సతి లింగము పతి* అనే భావముతో ఉన్నవాడే భక్తుడు. పరిశుద్ధమైన కాయకముద్వారా, తాను సంపాదించిన సంపదతో దీనులకు పేదలకు నిస్వార్ధతుతో సమాజానికి (జంగమానికి) త్రివిధమైన దాసోహము ( ~దానము~) భావము అంటే గురువుకు (జ్ఞానానికి) తనువును, లింగానికి మనస్సును, జంగమానికి ధనమును వెచ్చించాలి. ప్రసాదము అంటే తినే తిండి కాదు., శరణుల దృష్టిలో ప్రసాదము అంటే, శరణసాహిత్య పరిజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శక్తిని శరణులనుండి సంపాదించడమే ప్రసాదము, అటువంటి మహాప్రసాదాన్ని స్వీకరించేవాడే భక్తుడు,. సృష్టి స్థితి లయకు కారణమైన శక్తికి ఆధారమే భక్తుడు. భక్తి అనే మార్గాన్ని భక్తుడు ఎల్లప్పుడూ కాపాడుకుంటూ జీవనాన్ని కొనసాగించేవాడే భక్తుడు. నేను జీవించి వుండడానికీ ముఖ్య ఆధారమే భక్తుడు, నీకూ నీ నిజ స్వరూపాన్ని యావత్తు మానవకోటికి అందించిన మహానుభావుడే భక్తుడు. నేను, నాది అనే అహంకారం మనసా వాచా కర్మణా లేనివాడే నిజమైన భక్తుడు. ఈ విధమైన భక్తి లక్షణాలను కలిగివున్న సంగన బసవేశ్వరుని శ్రీ పాద పద్మములయందు మకరందమును సేకరించే దుంబివోలే భ్రమితుడై వుంచుమయ్యా మహాలింగగురు శివసిధ్ధేశ్వర ప్రభువా!! అని పరమేశ్వరుడిని వేడుకుంటూ బసవేశ్వరుని భక్తిప్రౌరత్తులను స్తుతించడం జరిగింది.

లింగాయతుల ధర్మగ్రంథమైన వచన సాహిత్యమును అందరూ చదవాలి, అందరిచే చదివించాలి.

సూచిక (index)
*
Previousశివయోగి సిధ్ధరామేశ్వరుని బసవ స్తుతి వచనముపోస్టల్ స్టాంప్ మరియు నాణెం పై గురు బసవన్న.Next
*