విశ్వగురు బసవేశ్వరులవారిపై ప్రముఖుల ప్రశంస

*

బసవేశ్వరుడు భారతదేశంలో మానవ కల్యాణం కోసం ప్రతిభాసంపన్నమైన స్వతంత్ర సమాలోచనచేసిని మొదటివ్యక్తి. పురాతన బూజుపట్టిన మూఢాచారాల, సంప్రదాయాలకు విరుద్ధంగా బావుటాను ఎగురవేసిన మోదటి సంఘసేవకుడు. వారిని భారన మార్టినలూథర్ అనవచ్చను.

-ఆర్థర్ మైల్స్, పాశ్చాత్య తత్త్వవేత్త. [-Arthor Miles (Land of Lingama, London 1933 P-iii)]

భారతదేశపు ధర్మాస్థాపకులందరికన్నా హెచ్చుగా మంచి గుణాలగల, హెచ్చు యొగ్యతగలవాడు బసవేశ్వరుడే

- సి. పి. బ్రౌన్, పాశ్చాత్య తత్త్వవేత్త.

దయను కర్తవ్యంగా భావించిన, స్త్రీ పురుషులకు సమాన అధికారాలు ప్రకటించిన, ప్రతివ్యక్తి కష్టించి పనిచేసి పరస్పర సహకారంతో జీవితం గడపాలని ప్రబోధించిన బసవేశ్వరుడిని దైవతులైమైన మానవునిగా భావించాలి.

- జాన్, రస్సెల్, పాశ్చాత్య తత్త్వవేత్త.

ఆధునిక సంఘ సేవకులు బసవేశ్వరుని భాషనే మాట్లాడుతున్నారు. వారి అలోచనలను తమ రచనలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

- సర్జేమ్స్ కాంప్బెల్, పాశ్చాత్య తత్త్వవేత్త.

సాహిత్యం, తత్త్వశాస్త్రం దృష్టితో చూచిన ఎంతో ఉత్కృష్టమైన, శ్రేష్టమైన బసవ వచనాలు సమస్థ ప్రపంచ ప్రజానికి ప్రేరనదాయకవైనట్టివి, మార్గదర్శకము గావించునట్టివి మరియు ఉపయుక్తమైనట్టివి.

- డా|| కె.వి. జ్వలేబిల్, పాశ్చాత్య విచారకుడు.

సుమారు ఎనిమిది వందల సంవత్సరాలనాడు మహాత్మా బసవేశ్వరుడు సత్యం, అహింస, సమత, శ్రమగౌరవం అను విషయాలను ప్రచారం చేశాడు. ఆతడు తెలిపిన విషయాలు మన భారతీయ సంస్కృతి సారాంశము. బసవేశ్వరులవారి ద్వారా ప్రారంభించబడిన మానవతావాద పనులను నేనిప్పుడు పూర్తిచేయవలసియున్నది.

- జాతిపిత మహాత్మాగాంధి

వర్ణ, వర్గ భేదాలు, ఉచ్ఛ-నీచ భేదాలు, అంటరానితనానికి విరుద్ధంగా పోరాడిన బసవేశ్వరుడు మొట్టమొదట సమాజవాది. కర్మకాండ, సనాతనవాదుల స్వార్థానికి విరుద్ధంగా పోరాడిన బసవేశ్వరుడు సామాజిక విప్లవకారుడు.

- లోకనాయక జయప్రకాశ్ నారాయణ

20వ శాతబ్దంలో మనం ఎట్టి సాంఘిక, ధార్మిక సంస్కృరణలను ఊహిస్తున్నామొ, వాటిలో చాలావాటిని 12వ శతాబ్ధంలో కర్నాటక యందు మహాత్మా బసవేశ్వరులవారు అమలులోనికి తెచ్చారు. వసవేశ్వరులవారు చేసిన ఉపదేశాలు సర్వమానవులూ స్వీకరింపదగినవి.

- ఆచార్య వినోబాభావే

బసవేశ్వరుల విశాలహృదయం, మానవతావాదానికి ముకుటం, వారిని దేవునిలా పూజించటానికి బదలు ఆతడి ప్రవచనాలను అన్ని ప్రముఖ భాషలలో అనువదించి ఆయన చరిత్రను ప్రచురించాలి. ఎందుకంటే ఆయిన బహుముఖ ప్రతిభాశాలియైన సాధువు, లోకనాయకుడు.

- డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్, భారత మాజీ రాష్ట్రపతి, విశ్వవిఖ్యాతి తత్త్వవేత్త.

బసవేశ్వరులవారు తెలిపిన ధర్మమార్గం అనేక తత్త్వాలతో కూడుకోని ఉన్నది. ఆయిన ప్రవచించిన విషయాలను మనమంతా ఆచరించాలి.

-భారతరత్న మురార్జీ దేసాయ్, భారత మాజి ప్రధానమంత్రి.

బసవేశ్వరులవారు ప్రథమ అంతర్జాతీయవాది.

- పి. వి. నర్సింహరావు, , భారత మాజి ప్రధానమంత్రి.

బుద్ధ భగవానుడు, జైన మహావీరుని తర్వాత కులమతభేదాలు, పురోహిత పద్ధతి, యజ్ఞయాగాదులను మనస్ఫూర్తిగా నిరసించిన బసవేశ్వరుడు మానవతావాది, విశ్వబంధుత్వవాది. ఆయన చేసిన సాంఘిక, ధార్మిక సాంస్కృతిక అధ్యాత్మిక పనులు ఎంతో విలువైనది. బసవేశ్వరుడు అంటె సూర్యుని తేజత్వం, చంద్రుని శీతలత్వం, మహాసముద్రం గొప్పదనం దివ్యత్వం సాక్షాత్తు ప్రతి రూపమే.

- మహాతపస్వి శ్రీ కుమారస్వామిగారు (గొప్ప యోగిపుంగవులు)

మహాత్మ బసవేశ్వరుని మానవతా వాదమే దేశాన్ని రక్షించగలదు.

- జ్ఞాని జైల్సింగ్, భారత మాజీ రాష్ట్రపతి

బసవేశ్వరుని ఆలోచనతో నేటి ప్రపంచంలో వ్యాపించిన కష్టాలు నశించపొవటానికి సహాయం లభిస్తుంది. పన్నెండవ శతాబ్దానికి చెందిన బసవయుగం భారతీయ చరిత్రలో స్వర్ణయుగం అని చెప్పబడుతుంది.

- డా|| బి. డి. జత్తి, భారత మాజీ ఉప రాష్ట్రపతి బసవసమితి బెంగళూరు, స్థాపక అధ్యక్షులు

బసవేశ్వరుని కంటే ముందు సాంఘిక ధార్మిక సంస్కరణల కోసం ఎన్నోప్రయత్నాలు జరిగాయి, కాని బసవేశ్వరుడు ఆ రోజలలో ఎంతో సాహసించి, స్త్రీ విముక్తి, సంఘసంస్కరణ కోసం గొప్ప పని చేశారు. బాల్య వివాహాలు, విధవల దాసత్వం, స్త్రీ ఉన్నతి మొదలగు వాటి గురించి బసవేశ్వరుడు మహొన్నతమైన పని చేసారు. నేడు కూడా ప్రతి సంవత్సరం ఈ విషయాలపై చర్చ జరుగుతుంది. కాని బసవేశ్వరుడు చేసిన పనులతో పోలిస్తే అవన్నీ లెక్క లోనికి తిసుకోదగినవి కాదు.

- టైమ్స్ ఆఫ్ ఇండియా (మే 18, 1918)

నేడు ఎంతో గొప్పపనిగా భావించే సమాజనిర్మాణం, స్త్రీ-పురుషుల సమానత్వం, సంకుచితమైన మత భేదాలు త్వజించటం, విశ్వబంధుత్వబోధన మొదలగు తత్త్వాలను మహాత్మ బసవేశ్వరులు పన్నెండవ శతాబ్దంలో సమర్థించారు. ఆయన ప్రపంచంలో మహాపురుషులలో ఒకరు.

- ఎస్. నిజలింగప్ప మాజి జాతీయ కాంగ్రస్ అధ్యక్షలు, కర్ణాటక మాజి ముఖ్యమంత్రి.

బసవేశ్వరుని సందేశాలు ఇప్పటి వరకు సర్వత్రా ప్రచారం కాక పోవటం ఎంతో దురదృష్టకరం, ఎనాడైతే ఆయన చేసిన పనులు సందేశాలు ప్రపంచం గ్రహిస్తుందో ఆనాడు వసవేశ్వరునికి బుద్ధుడు, జైనుడుల వరుసలో సముచిత స్థానం ఇవ్వవలసివస్తుంది.

- ప్ర. బా. గజేంద్రగడ్కర్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, న్యూఢిల్లి

మధ్యయుగానికి చెందిన గొప్ప సాధువలలో మహాత్మ బసవేశ్వరులోకరు. ఆయన సంఘ సంస్కరణ కోసం ఎంతో గొప్ప సేవచేశారు. మానవులందరూ భగవంతుని సంతానం కనుక వారందరూ సమానులే అన్న ఈతత్త్వాన్ని అయననోక్కి వక్కాణించారు.

- ఇందిరాగాంధి భారత మాజి ప్రధానమంత్రి

బసవేశ్వరులు అసాధారణమైన సంవేదనాశీలురు, విలక్షణ ద్రష్ట, ఆయిన 800 సంవత్సరాల క్రీతమే సాంఘిక, ధార్మిక సమత్వాన్ని అందరికి తెరచిన శ్రేయస్సు బసవేశ్వరునికే దక్కుతుంది.

- ఆర్. వెంకటరామన్, భారత మాజీ రాష్ట్రపతి

శ్రమయే స్వర్గముగా భావించి, మానవతా సందేశాన్ని ఇచ్చిన మహాత్మ బసవేశ్వరుని (పన్నెండవ శతాబ్ధానికి చెందిన సంఘసేవకుడు) సందేశాలను మనం తప్పక ఆచరించాలి. సమాజంలోని అట్టడుగు దుర్బల వర్గాన్ని ఉద్దరించడం కోసం బసవేశ్వరుడు చేసిన కృషి నేటికీ ఆదర్శవంతమైనదే.

- రాజీవ గాంధి భారత మాజి ప్రధానమంత్రి

సూచిక (index)
*
Previousగురు బసవేశ్వర ప్రధాన ఘట్టములు (1134-1196)సంక్షిప్త జీవన చరిత్ర (1134-1196)Next
*