|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమ: ||

భహురూపి చౌడయ్యగారి బసవ స్తుతి వచనము

✍ మడపతి.వి.వి.
లింగాయత సమన్వయ సమితి
హైదరాబాద్ తెలంగాణ.

"కామమనే దట్టమైన అడవి మందిరములో, శుక్లశోణితమనే కుండను చేసి,
మూత్రము శ్లేష్మఅమేధ్యమనే పాకద్రవ్యములు పోసారయ్యా ,
కుండను గమనించి ఆ కుండను పగులగొట్టి చూడుమా,
రేకణ్ణప్రియ నాగినాథా బసవణ్ణగారిచే బ్రతికితిని.!" - వచన సంపుటం: 8, వచన సంఖ్య : 147

పై వచనము 12 వ శతాబ్దములో కల్యాణ నగరంలోని వీధి వీధిలో రకరకాలుగా వేషధారణ చేసి ఆడుతూ పాడుతూ బసవేశ్వరుని వచనాలను, శరణుల వచనాలను, జన సామాన్యులకు సాహిత్యా న్ని అందించిన మహానుభావుడు రాసినది . పై వచనములో బసవేశ్వరుని భక్తి ప్రౌరుత్తుల గురించి చాలా అద్భుతంగా వివరించారు.

"*కామమనే దట్టమైన అడవి మందిరములో, శుక్లశోణితమనే కుండను చేసి,*"
అరిషడ్వర్గాలైన - కామము, క్రోధము, లోభము, మోహము, మదమూ, మత్సరమనే, వాటిలో ప్రముఖమైనది చాలా భయంకరమైనది మొట్టమొదటిది కామము. కామము అంటే దేహమును దహించునది మాత్రమే కాదు. శరణులు ఈ అరిషడ్వర్గాలను మనసా, వాచా, కర్మణా సంహరించాలని సూక్ష్మంగా చెప్పడం జరిగింది. ఈ దేహమనే పవిత్ర మందిరములో నేను, నాది, అనే కామము ఆవరించి వున్నది. ఆ కామముతో పాటు రక్తము, సిరము, మరియూ శుక్ల శోణితము ఈ దేహములో కలిగి ఉన్నది.

*మూత్రము శ్లేష్మ అమేధ్యమనే పాకద్రవ్యములు,*
ఈ దేహ సౌందర్యాన్ని చూసి సంతోషపడే ఓ మానవుడా నీలో దాగివున్న అనేక వ్యర్థ ద్రవ్యములైన మూత్రము, శ్లేష్మము, మరియు వీటితో కూడిన అమేధ్యమనే పాక ద్రవ్యములు కూడి ఉన్నాయి చూడుమా.!

*కుండను గమనించి ఆ కుండను పగులగొట్టి చూడుమా, రేకణ్ణప్రియ నాగినాథా బసవణ్ణగారిచే బ్రతికితిని.!"*
ఈ దేహమనే అద్భుతమైన కుండను జాగ్రత్తగా గమనించి చూచిన, నీ మనస్సులోనే పరమాత్ముడు దాగివున్నాడు చూడుమా. తనలో దాగివున్న అరిషడ్వర్గాలను పగులగొట్టి (త్రెంచివేసి) గమనించి నీలో నీవు చూసినచో , ఓ పరమేశ్వరా...! రేకణ్ణప్రియ నాగినాథుడా, బసవణ్ణ నేర్పించిన భక్తి సామ్రాజ్యములో బ్రతుకుతున్నాను చూడుమా. అని విశ్వగురు బసవేశ్వరుని భక్తి తత్వాన్ని చాటి చెప్పడం జరిగినది.

సూచిక (index)
*
Previousసంక్షిప్త జీవన చరిత్ర (1134-1196)శివయోగి సిధ్ధరామేశ్వరుని బసవ స్తుతి వచనముNext
*